Latest Videos

పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మానస్... బ్రహ్మముడి సీరియల్ హీరో మామూలు ఫాస్ట్ కాదు!

By Sambi ReddyFirst Published Jul 5, 2024, 7:11 AM IST
Highlights

బిగ్ బాస్ ఫేమ్ మానస్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్న విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ నటుడు పెళ్లై ఏడాది గడవక ముందే ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ కి వెల్కమ్ చెప్పాడు. 
 

మానస్ నాగులపల్లి నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలైంది. 2011లో ఝలక్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా.. ఇలా పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించాడు. అవేమీ గుర్తింపు తీసుకురాలేదు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 5లో మానస్ కంటెస్ట్ చేశాడు. 

బిగ్ బాస్ షో మానస్ కి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా ఫైనల్ కి వెళ్ళాడు. హౌస్లో మానస్ ఎఫైర్స్ కి దూరంగా ఉన్నాడు. అయితే ఓ ట్రాన్స్జెండర్ మానస్ ని ఇష్టపడటం విశేషం. ప్రియాంక సింగ్ కి మానస్ అంటే చాలా ఇష్టం. హౌస్లో మగాళ్లు అందరు నాకు అన్నయ్యలే, ఒక్క మానస్ తప్ప అని ప్రియాంక ఓపెన్ గా చెప్పింది. ఎప్పుడూ ప్రియాంక మానస్ చుట్టే తిరిగేది. అతడికి సేవలు చేసింది. 

మానస్ ప్రియాంకను పూర్తిగా దూరం పెట్టలేదు. అలా అని దగ్గర కూడా కాలేదు. ఆమెతో స్నేహం చేశాడు. బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ కార్తీక దీపం సీరియల్ లో ఆఫర్ తెచ్చి పెట్టింది. అయితే దీప, కార్తీక్ లేకుండా చేసిన ఆ ప్రయోగం ఫలించలేదు. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. ఇది సూపర్ హిట్ అని చెప్పాలి. అత్యధిక టీఆర్పీ రాబడుతున్న సీరియల్ గా బ్రహ్మముడి ఉంది. కార్తీక దీపం 2క్లి మించి బ్రహ్మముడి సీరియల్ కి ఆదరణ దక్కుతుంది. 

కాగా గత ఏడాది నవంబర్ లో మానస్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు శ్రీజ నిస్సంకర. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. మానస్-శ్రీజ వివాహానికి బంధు మిత్రులు, టాలీవుడ్ సెలెబ్స్ హాజరయ్యారు. పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పాడు మానస్. తన భార్య గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. త్వరలో బేబీ నాగులపల్లి వస్తుందని కామెంట్ చేశాడు. మానస్ తండ్రి అయ్యాడన్న విషయం తెలిసిన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 

click me!