సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ముగ్గురు నటీమణులను కాపాడిన పోలీసులు!

By AN TeluguFirst Published Jan 17, 2020, 12:26 PM IST
Highlights

ఈ విషయాలను ముంబై పోలీసులు బయటపెట్టారు. తూర్పు అంధేరీలో ఓ హోటల్ లో గురువారం నాడు దాడులు జరుపగా.. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియా శర్మని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఓ త్రీ స్టార్ హోటల్ లో సాగుతోన్న హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టుని ముంబై పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్ ని నిర్వహిస్తోన్న ప్రియా శర్మ(29) అనే మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు.

అలానే వ్యభిచార కూపం నుండి ముగ్గురు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఆ ముగ్గురూ కూడా నటీమణులే కాగా.. అందులో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. ఈ విషయాలను ముంబై పోలీసులు బయటపెట్టారు.

వేరొకరితో ఎఫైర్.. సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం

తూర్పు అంధేరీలో ఓ హోటల్ లో గురువారం నాడు దాడులు జరుపగా.. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియా శర్మని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార కూపంలోకి ఆ ముగ్గురినీ బలవంతంగా తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్రియా శర్మ కందివాలి తూర్పులో టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అనైతిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుంది. పోలీసులు కాపాడిన ముగ్గురు మహిళల్లో ఒకరు  ఓ ప్రముఖ టీవీ చానల్‌ నిర్వహించే క్రైమ్‌ షోలో పనిచేశారు. మరొకరు మరాఠీ చిత్రాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్నారు. మైనర్‌ నటి ఓ వెబ్‌ సిరీస్‌లో నటించారు. 

click me!