సీరియల్స్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయశ్రీ సూసైడ్ కి ప్రయత్నించడం తమిళ సినీ పరిశ్రమలో అందరిని షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. భర్తతో మనస్పర్థలు రావడం కారణంగా నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తిరువాణ్మయూర్‌ కు చెందిన ఈశ్వర్, జయశ్రీ. ఇద్దరూ సీరియల్స్ లో నటిస్తున్నవారే. ప్రేమ వివాహంతో గత కోనేళ్ళుగా సంతోషంగా ఉంటున్న వీరి జీవితంలో ఇటీవల మనస్పర్థలు మొదలయ్యాయి. అయితే రీసెంట్ భర్తపై వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్లు జయ శ్రీ  చెన్నై పోలీసులకు పిర్యాదు చేసింది. రోజు ఇంట్లో తనను వేధిస్తున్నాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కేసు నమోదు చేశారు.

అయితే ఇంతలో జయ శ్రీ ఎవరు ఊహించని విధంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం మరింత అనుమానాలకు దారి తీసింది. బుధవారం వండలూర్‌ ప్రాంతంలో కొన్ని గుడిసెలు కాలిపోవడంతో బాధితులను పరామర్శించడానికి వచ్చిన జయ శ్రీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా భర్త నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది.  ఆ వెంటనే జయశ్రీ నిద్ర మాత్రలు మింగేసింది. ఆమెకు తోడుగా వచ్చిన ఒక వ్యక్తి వెంటనే సమీప హాస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న నీలాంగరై పోలీసుల కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం జయ శ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.