బుట్టబొమ్మ హార్ట్ టచింగ్ వీడియో.. బన్నీ ఫిదా!

By Prashanth MFirst Published Feb 11, 2020, 9:17 AM IST
Highlights

అల.. వైకుంఠపురములో' సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టిక్ టాక్ లో అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టిక్ టాక్ లో అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

అందులో ఒక వీడియో బన్నీ హృదయాన్ని తాకింది. దివ్యంగులు కూడా ఎంతో ఆనందంగా బుట్ట బొమ్మ సాంగ్ స్టెప్పులు వేయడం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ఇక బన్నీ కూడా ఆ వీడియోను చూసి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేశాడు. ఆ వీడియో తన హార్ట్ ని టచ్ చేసింది అని.. నిజంగా చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This was the most heart touching one of all the Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. pic.twitter.com/67tawEvkPP

— Allu Arjun (@alluarjun)

ఇక ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కల్లెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'అల.. వైకుంఠపురములో' నిలిచింది. మొదటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా 2020లో టాప్ 1 ప్లేస్ ని అందుకున్న ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలంటే సమయం చాలానే పడుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన రికార్డులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ కూడా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.

 ఇప్పుడు ఇండస్ట్రీలో మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కిస్తే బావుంటుందని చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ దర్శకులకు ఇచ్చిన స్పెషల్ పార్టీలో ఈ విషయంపై డిస్కర్షన్ నడిచినట్లు తెలుస్తోంది. చాలా మంది  డైరెక్టర్స్ సీక్వెల్ అంశాన్ని త్రివిక్రమ్ ముందట ఉంచినట్లు టాక్. ఇంతవరకు అలాంటి సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ చూపని మాటల మాంత్రికుడు మొదటిసారి ప్రయోగం చేస్తాడా లేదా అనేది చూడాలి.

click me!