కృష్ణాజిల్లా సమావేశంలో రసాబాస... వైసిపి ఎమ్మెల్యే, టిడిపి ఎమ్మెల్సీ బాహాబాహి

By Arun Kumar PFirst Published Oct 11, 2019, 7:07 PM IST
Highlights

కృష్ణా జిల్లా డిడిఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రులపై టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. వైసిపి, టిడిపి నాయకులు భాహాభాహికి కూడా సిద్దమయ్యారు.  

కృష్ణా జిల్లాలో ఉపాధిహామీ నిధుల బకాయిల అంశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. జిల్లాలో 236 కోట్లు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ జిల్లా మంత్రులను ప్రశ్నించారు. అవినీతి జరిగింది కాబట్టి డబ్బులు ఇవ్వలేమని ఇంచార్జి మంత్రి కన్నబాబు సమాధానం చెప్పారు. దీంతో గందరగోళం నెలకొంది. కన్నబాబు వ్యాఖ్యలకు నిరసనగా రాజేంద్రప్రసాద్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.

మచిలీపట్నంలో జరిగిన డిడిఆర్సీ సమావేశంలో టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మంత్రుల మధ్య వివాదం సాగింది.  మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెళ్ళంపల్లి శ్రీను, అధికారపార్టీ ఎమ్మెల్యేలకు మధ్యన పలు అంశాలపై పలుమార్లు  తీవ్ర వాగ్వివాదం నడిచింది. ఎమ్మెల్యే జోగి రమేష్ కి రాజేంద్రప్రసాద్ కి మధ్య జరిగిన గొడవతో సమావేశంలో మరింత ఉద్రిక్తత పెరిగింది. ఇరువురికి  ఇంచార్జీమంత్రి కన్నబాబు సర్దిచెప్పి శాంతపరిచారు. 

జిల్లాలో రైతులకు రావాల్సిన రైతు ఋణమాఫీ బకాయిలు రూ.1000 కోట్లు రాకుండా ఇచ్చిన జీవో 99 కాఫీని చించి రాజేంద్రప్రసాద్  వాకౌట్ చేశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు ఆయనతో పాటు బయటకు వెళ్లిపోయారు. 

గ్రామ సచివాలయాల గురించి గొప్పలు చెప్పుకోవద్దని వారి వైసిపి నాయకులకు సూచించారు. 2002 లోనే తమ నాయకుడు చంద్రబాబు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే 2007లో వైఎస్ గ్రామ సచివాలయాల ఏర్పాటు జీఓలు రద్దు చేశారనపి గుర్తుచేశారు. వైఎస్సార్ రైతు భరోసా లో సర్పంచు, ఎంపిటిసిలను మినహాయించారని... ఇది అన్యాయమన్నారు. సర్పంచులు, ఎంపిటిసిలలో ఎక్కువ మంది పేద ఎస్సీ బీసీ మైనార్టీలేనని వారికి అన్యాయం జరుగుతోందన్నారు. 

click me!