అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు... కర్నూలులో న్యాయవాదుల సంబరాలు

By Arun Kumar PFirst Published Jan 20, 2020, 3:24 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే కర్నూల్ పట్టణంలో లాయర్లు సంబరాల్లో మునిగిపోయారు. కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపర్చారు. 

కర్నూల్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే కర్నూలు జిల్లాలోని న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ కు ఈరోజు న్యాయం జరిగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుండి ఎన్నికయినా కర్నూల్ ను జగన్ మోహన్ రెడ్డిలా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మాట ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు న్యాయ రాజధానిని ప్రకటించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతునన్నట్లు న్యాయవాదులు తెలిపారు. 

read more  

14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాలు వైసీపీకి ఇచ్చిన జిల్లా ప్రజలు న్యాయ రాజధానిని ప్రకటించి రుణం తీర్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని రావడం వల్ల కర్నూలు జిల్లాలో జిరాక్స్ మిషన్ లు, టి కోట్లు తప్ప పెద్దగా లాభం లేదని విమర్శించే వారికి అభివృద్ధి చెందిన తర్వాత సమాధానం దొరుకుతుందని ఎద్దేవా చేశారు.

లాయర్లంతా నగరంలో నడిబొడ్డున కర్నూలు ఐకాన్ గా ఉన్న కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుని అక్కడే స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఆనందంలో స్థానిక ప్రజలు కూడా పాలుపంచుకున్నారు. 

click me!