దోపిడీ దొంగ అరెస్ట్... 17తులాల బంగారం స్వాధీనం

Published : Sep 27, 2019, 12:16 PM ISTUpdated : Sep 27, 2019, 12:22 PM IST
దోపిడీ దొంగ అరెస్ట్... 17తులాల బంగారం స్వాధీనం

సారాంశం

అతడి దగ్గర నుంచి లక్ష రూపాయల నగదు, 17 తులాల బంగారం, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పేరు మహమ్మద్ ఇబ్రహీం అలియాస్ బాబాగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇతను నగరంలో పదుల సంఖ్యలో దోపిడీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ... పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తరుచూ దొంగతనం చేస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసేవాడు.

కాగా... గురువారం అతనిని  ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి లక్ష రూపాయల నగదు, 17 తులాల బంగారం, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పేరు మహమ్మద్ ఇబ్రహీం అలియాస్ బాబాగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇతను నగరంలో పదుల సంఖ్యలో దోపిడీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తున్న వ్యక్తిపై నిఘా ఉంచామనీ, అతడిని పట్టుకోవాలనే సవాలుతో రంగంలోకి దిగామనీ, ఎంత ప్రయత్నించినా అతడి జాడ తెలియలేదని ఆయన అన్నారు. ఈ రోజు అతడి కోసం గాలిస్తుండగా దొరికిపోయాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?