కానిస్టేబుల్ అభ్యర్ధులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు: కర్నూలు జిల్లా ఎస్పీ

By Siva KodatiFirst Published Oct 3, 2019, 4:45 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు ధృవపత్రాల పరిశీలన ప్రారంభమైంది. గురువారం కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ధ్రువపత్రాల పరిశీలన జరిగింది

కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు ధృవపత్రాల పరిశీలన ప్రారంభమైంది. గురువారం కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ధ్రువపత్రాల పరిశీలన జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మాట్లాడుతూ.. ఎంపికైన అభ్యర్ధులు ధృవపత్రాల పరిశీలనలో తప్పుడు సమాచారం ఇవ్వకూడదన్నారు.

ఏక్కడైనా పోలీసు కేసులలో ఉన్నట్లయితే తప్పనిసరిగా సంబంధిత ధృవపత్రంలో పొందుపరచాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు.

కర్నూలు జిల్లాకు 180 మంది సివిల్ కానిస్టేబుళ్ళు , 08 మంది ఆర్ముడు రిజర్వుడు కానిస్టేబుళ్ళు , 30 మంది ఎపిఎస్పీ కానిస్టేబుళ్ళు, 11 మంది వార్డర్ కానిస్టేబుళ్ళు , 30 మంది ఫైర్ కానిస్టేబుళ్ళుగా ఎంపికయ్యారని.. వీరంతా వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఫక్కీరప్ప వెల్లడించారు. 

click me!