ప్రపంచ కప్ 2019: అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు గుడ్ న్యూస్

By Arun Kumar PFirst Published Apr 17, 2019, 6:44 PM IST
Highlights

ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కక తీవ్ర నిరాశకు లోనైన  అంబటి రాయుడు, రిషబ్ పంత్ లకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది బిసిసిఐ. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 15 మందిలో ఎవరికైనా గాయమైతే వీరితో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 

ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కక తీవ్ర నిరాశకు లోనైన  అంబటి రాయుడు, రిషబ్ పంత్ లకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది బిసిసిఐ. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 15 మందిలో ఎవరికైనా గాయమైతే వీరితో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 

వీరిద్దరితో పాటు ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న బౌలర్ దీపక్ సైనీని స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం బిసిసిఐ  నుండి అధికారిక ప్రకటన వెలువడింది. 

ఈ ముగ్గురిలో రిషబ్ పంత్ మొదటి స్టాండ్ బై ఆటగాడు కాగా అంబటి రాయుడు రెండో స్టాండ్‌బై ఆటగాడు. టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ ఆడే సమయంలో ఎవరైనా బ్యాట్ మెన్ జట్టుకు దూరమైతే  మొదట పంత్ తో భర్తీ చేస్తారు. ఆ తర్వాత కూడా మరెవరైనా జట్టుకు దూరమైతే రాయుడు జట్టులో చేరతాడు. ఇక బౌలర్లు దూరమైతే సైనీ వారి స్థానంలో జట్టులోకి చేరుతాడు. ఇలా 15 మంది ఆటగాళ్లలో ఎవరు గాయపడ్డా వీరిలో ఒకరు ఇంగ్లాండ్ కు పయమవుతారన్న మాట. 

ఇక ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ లు కేవలం నెట్ బౌలర్లుగా మాత్రమే వ్యవహరిస్తారు. వీరు జట్టులో చేరే అవకాశం లేదు. కేవలం జట్టుతో పాటు వుంటూ నెట్ ప్రాక్టీస్ లో బ్యాట్ మెన్స్ బౌలింగ్ చేయడమే వీరి పని. అధికారికంగా స్టాండ్‌బై ఆటగాళ్లు మాత్రం పంత్, రాయుడు, సైనీలేనని బిసిసిఐ వెల్లడించింది.  

 ఐసిసి ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం రిషబ్ పంత్, అంబటి రాయుడుల పేర్లు సెలెక్టర్ల పరిగణనలోకి వచ్చాయి. వారిని జట్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై విస్తృతంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, చివరకు రిషబ్ పంత్ స్థానంలో దినేష్ కార్తిక్ కు, అంబటి రాయుడి స్థానంలో కెఎల్ రాహుల్ కు బిసిసిఐ సెలెక్టర్లు అవకాశం కల్పించారు. దీంతో వారిద్దరే కాదు సీనియర్లు, అభిమానులు సెలెక్టర్ల  నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా విమర్శల నుండి తప్పించుకునేందుకు సెలెక్టర్లు ఎంచుకున్న మార్గమే ఈ స్టాండ్‌బై ఆటగాళ్ల ఎంపిక. 

సంబంధిత వార్తలు

రాయుడిని సెలెక్టర్లెవ్వరూ వ్యతిరేకించలేదు...అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే...: చీఫ్ సెలెక్టర్

ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!