ప్రపంచ కప్ 2019: స్వదేశంలో తలపడే ఇంగ్లాండ్ జట్టిదే...ఆర్చర్‌కు మొండిచేయి

By Arun Kumar PFirst Published Apr 17, 2019, 5:42 PM IST
Highlights

స్వదేశంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ప్రపంచ దేశాల సమరానికి ఇంగ్లాండ్ సిద్దమయ్యింది. మే 30 నుండి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ 2019 లో ఇంగ్లాండ్ జట్టు తరపున ఆడే ఆటగాళ్ల జాబితాను ఈసిబి ప్రకటించింది. బుధవారం ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఈ మెగా ఐసిసి టోర్నీ కోసం ఎంపికచేసింది.  

ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్ని ప్రపంచ కప్ లో బరిలోకి దిగే తమ జట్లను ప్రకటించాయి. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కూడా తమ ఆటగాళ్ల ఎంపికను వేగవంతం చేసి ఇవాళ ప్రకటించింది. అయితే ఈసారి ప్రపంచ కప్ జట్టులో తప్పకుండా స్థానం సంపాదించాలని పట్టుదలతో  అత్యుత్తమంగా రాణిస్తున్న జోఫ్రా ఆర్చర్ కు మాత్రం నిరాశే ఎదురయ్యింది. ఈ ఏడాది జరిగిన బిగ్ బాష్‌ లీగ్‌, ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ లో ఆర్చర్ అద్భుతంగా ఆడి తానేంటో నిరూపించుకున్నా ప్రపంచ కప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 

2016లో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి ఆరంగేట్రం చేసిన ఆర్చర్ అతి తక్కువ కాలంలోనే ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన బౌలర్ స్ధాయికి ఎదిగాడు. అతడు గత రెండేళ్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 267 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫామ్ ను పరిగణలోకి తీసుకుని సెలెక్టర్లు ప్రపంచ కప్ జట్టుకు ఎంపికక చేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ అంతకు ముందు జరిగే పాకిస్థాన్, ఐర్లాండ్‌లతో జరగనున్న సీరిస్ లకు ఆర్చర్‌ని ఎంపికచేశారు. 

ప్రపంచ కప్ లో తలపడే ఇంగ్లాడ్ జట్టిదే:
 
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్) మొయిన్ అలీ, బెయిర్ స్టో, బట్లర్, కుర్రమ్, అలెక్స్ హేల్స్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్  
 
click me!