పంజాబ్ విజయం: రాజస్థాన్ కు క్వాలిఫయర్ అవకాశాశాలు క్లిష్టం

Published : Apr 17, 2019, 06:55 AM IST
పంజాబ్ విజయం: రాజస్థాన్ కు క్వాలిఫయర్ అవకాశాశాలు క్లిష్టం

సారాంశం

ఐపిఎల్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడి ఆరు మ్యాచులో ఓడింది.

మొహాలి: ఐపిఎల్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడి ఆరు మ్యాచులో ఓడింది. దీంతో క్వాలిఫయర్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (47 బంతుల్లో 52 పరుగులు), మిల్లర్‌ (27 బంతుల్లో 40 పరుగులు), కెప్టెన్‌ అశ్విన్‌ (4 బంతుల్లో 17 నాటౌట్‌) ధీటుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. 

లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రాహుల్‌ త్రిపాఠి (45 బంతుల్లో 50) అర్ధసెంచరీ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?