స్వదేశానికి వచ్చేలోపే బెయిల్...: లాయర్ తో షమీ మంతనాలు

By Arun Kumar PFirst Published Sep 8, 2019, 6:10 PM IST
Highlights

టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ బెయిల్ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. వెస్టిండిస్ పర్యటన  ముగిసిన వెంటనేే యూఎస్ కు చేరుకున్న అతడు అక్కడినుండే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు  ఓ బిసిసిఐ అధికారి తెలిపారు.  

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి గృహహింస కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో వున్నాడు కాబట్టి  స్వదేశానికి రాగానే అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం  చేస్తున్నారు.ఈ క్రమంలోనే షమీ వెస్టిండిస్ నుండే బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. 

''వెస్టిండిస్ పర్యటన ముగియగానే షమీ అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడినుండే తన లాయర్  సలీమ్ రహ్మాన్ తో టచ్ లో వున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన స్వదేశానికి వచ్చేందుకు షమీ సిద్దమయ్యాడు. ఆలోపే కోర్టు నుండి బెయిల్ పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.'' అని సదరు బిసిసిఐ అధికారి వెల్లడించారు. 

గతకొంత కాలంగా షమీకి అతడి భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. భర్తకు దూరంగా వుంటున్న హసీస్ షమీతో పాటు వారి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుపుతున్న అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్ లను అరెస్ట్ చేయాల్సిందిగా అదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.   ఇందుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. 15రోజుల్లోగా వారిద్దరిని అరెస్ట్ చేసి తమముందు హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

అయితే ప్రస్తుతం  షమీ విదేశాల్లో వున్నాడు కాబట్టి పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ బెయిల్ దొరకకుండా షమీ స్వదేశానికి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి అతడు అక్కడినుండే తన లాయర్ తో మంతనాలు జరుపుతూ బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షమీతోపాటు ఆయన సోదరుడిపై కూడా సెక్షన్ 498ఏ కింద కేసు నమోదయ్యింది. 

సంబంధిత వార్తలు

క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే

టీమిండియా బౌలర్ షమీ అరెస్టుకు రంగం సిద్దం... వారెంట్ జారీ

బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న షమీ భార్య... ఫోటో షూట్ వీడియో

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

టీం ఇండియా క్రికెటర్ షమీ భార్య అరెస్ట్

టీం ఇండియా క్రికెటర్ షమీకి అమెరికా షాక్

రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ భార్య.. కాంగ్రెస్‌లో చేరిక

భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

నిన్ను మిస్ అవుతున్నా.. క్రికెటర్ షమీ

  

click me!