ఓమిక్రాన్ వేరియంట్ ను వేగంగా గుర్తించేందుకు ఐసీఎంఆర్ ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నది. ఓమిక్రాన్ ను టెస్ట్ చేేసేందుకు ఇప్పటి వరకు జీనోమ్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగిస్తున్నారు. దీంతో ఫలితాలు రావడానికి చాలా టైం పడుతోంది. ఇప్పుడు కొత్త కిట్లు అందుబాటులోకి రావడంతో వల్ల ఈ టైం చాలా తగ్గనుంది.
కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పంజా విసురుతోంది. ఇండియాలో ఈ కేసులు ఇప్పటికే 150కి పైగా చేరుకున్నాయి. అయితే మన దేశంలో కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నా.. యూకేలో మాత్రం ఓమిక్రాన్ వేరియంట్ విళయతాండవం చేస్తోంది. అక్కడ ఒకే రోజులో దాదాపు 10 వేలకు పైగా కొత్త ఓమిక్రాన్ కేసులు భయటపడ్డాయి. మన దగ్గర కూడా రోజు రోజుకు కొత్త వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఈ ఓమిక్రాన్ కేసులను టెస్ట్ చేయడం వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారానే ఓమిక్రాన్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీఎంఆర్ కొత్త కిట్లను సమకూర్చుంటోంది.
కొత్త కిట్లతో వేగంగా ఫలితాలు..
ఐసీఎంఆర్ కొత్తగా సమకూర్చున్న కిట్ల ద్వారా ఇక ఫలితాలు వేగంగా రానున్నాయి. ఓమిక్రాన్ గుర్తించేందుకు ఇప్పుడు వాడుతున్న జీనోమ్ సీక్వెన్సింగ్ పద్దతి బాగానే ఉన్నా.. చాలా సమస్యలు ఎదురువుతున్నాయి. దీనిని అధిగమించేందుకు ఐసీఎంఆర్ కు చెందిన శాస్త్రవేత్తలు కొత్త పరీక్ష కిట్‌లపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు విజయవంతం కావడంతో కొత్త కిట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే వీటిని పారిశ్రామికంగా తయారు చేయాల్సి ఉంది. వీటిని పెద్ద ఎత్తున తయారు చేయడానికి పలు కంపెనీలను ఐసీఎంఆర్ ఆహ్వానిస్తోంది. అయితే ఆ కంపెనీలకు కేవలం తయారి హక్కులు మాత్రమే ఇవ్వనుంది. మిగితా సర్వ హక్కులు ఐసీఎంఆర్ వద్దే ఉంచుకోనుంది.
undefined
కలవరపెడుతున్న ఒమిక్రాన్.. కొత్తగా మరో 8 కేసులు.. మొత్తం 153
ఈ నెల మొదటి వారంలోనే ఇండియాలో కర్నాటకలోని బెంగళూరులో తొలి ఓమ్రికాన్ కేసులు గుర్తించారు. ఇప్పటి వరకు మన దేశంలో 153 కేసులు నమోదయ్యాయి. ఈ ఓమిక్రాన్‌కు కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడొక సమస్య ఏర్పడుతోంది. చాలా మందిలో కరోనా పాజిటివ్ అని గుర్తించినా.. అది డెల్టా వేరియంటా ? లేక ఓమిక్రాన్ వేరియంటా ? అని తెలుసుకునేందుకు చాలా సమయంలో పడుతోంది. ఒక్కో సారి 3 రోజుల సమయం వరకు కూడా తీసుకుంటోంది. దీని వల్ల పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడం ఆలస్యం అవుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు నెమ్మదిస్తున్నాయి. ఫలితం ఆలస్యంగా రావడం వల్ల పేషెంట్‌తో కలిసిన వ్యక్తులు సమాజంలో తిరుగుతున్నారు. దీంతో ఆ కేసులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా ఓమిక్రాన్ ఫలితాలు తొందరగా వస్తే ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్ లో ఉంచి, వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది.
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఓమిక్రాన్ టెస్టింగ్, రిజల్ట్స్ టైంను తగ్గించడానికి పలు పరిశోధనలు జరిగాయి. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి విజయం సాధించారు. దాని కంటే ముందే ఢిల్లీలోని ఐఐటీ ఈ కిట్ల విషయంలో పరిశోధనలు జరిపారు. ఆ యూనివర్సిటీ కూడా దాదాపు గంటన్నర వ్యవవధిలోనే ఫలితాలు వచ్చే ఒక కొత్త పరీక్ష పద్ధతిని కనుగొన్నది.డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేరియంట్‌లో ఏర్పడ్డ ఉత్పరివర్తనాలను గుర్తించే పద్దతి ద్వారా ఇందులో పాజిటివిటిని గుర్తిస్తారు.