Telangana Elections 2023: పోటీ చేయనన్న బాబు మోహన్.. ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ. . అసలేం జరిగింది ?

By Rajesh KarampooriFirst Published Nov 2, 2023, 5:57 PM IST
Highlights

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి.. ప్రచారంలో బిజీగా ఉండగా.. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారం సాగిస్తోంది. మరోవైపు.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసంతృపి, ఆశావాహా నేతలను బుజ్జగించే పనిలో పడ్డాయి. ఈ తరుణంలో ఓ బీజేపీ నేతకు మాత్రం పార్టీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ అభ్యర్థి ఎవరు? అసలేం జరిగింది.?

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఆసక్తి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బిఆర్ఎస్.. అన్ని పార్టీల కంటే ముందుగానే తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అసంతృప్తి, ఆశవాహ నేతలను బుజ్జగించి.. ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది.ఇక బిజెపి, కాంగ్రెస్ లు మాత్రం నింపాదిగా అభ్యర్థన ప్రకటిస్తూ..ప్రచారం సాగిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ 53మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. తాజాగా మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి 35 మందికి సీట్లు కేటాయించింది. అయితే ఈ జాబితాలో నటుడు, మాజీ ఎమ్మెల్యే  బాబు మోహన్ పేరు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

ఎందుకంటే.. ఈ సారి తనకు సీటు ఇచ్చిన ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. ఒకవేళ లిస్టులో తన పేరు వచ్చిన తాను పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే.. దీనికి కారణం కూడా లేకపోతే.. తాను పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు  గతంలో బాబు మోహన్ తెలిపారు. తనకు ఫస్ట్ లిస్ట్ లోనే టిక్కెట్ వస్తుందని ఆశించారు. కానీ, నిరాశే ఎదురైంది. దీంతో తాను తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు, పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదంటూ వాపోయారు. ఫైనల్ గా పార్టీ అధిష్టానం వ్యవహరించే తీరును బట్టి పార్టీలో ఉండాలా? లేదా? అనేది నిర్ణయించుకున్నారని వెల్లడించారు.  
 
గ‌త ఎన్నిక‌ల్లో బాబుమోహ‌న్ ఓడిపోవడం.. అతడు మూడో స్థానానికి పరిమితం కావడంతో ఈ సారి బాబు మోహన్ కు  టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అదే సమయంలో బాబు మోహ‌న్ కుమారుడికి టికెట్ ఇస్తార‌నే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ప్ర‌చారంపై బాబుమోహ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న‌కు అన్యాయం జరిగితే.. పార్టీని వీడుతానని, పోటీ నుంచి త‌ప్పుకుంటానని ప్ర‌క‌టించారు. అలాగే బీజేపీ నేతలు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు.

కానీ, తాజాగా విడుదలైన జాబితాలో అనూహ్యంగా ఆందోల్ స్థానం నుంచి బాబు మోహన్ బరిలో ఉన్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించడం అందర్ని ఆశ్యర్యపరిచింది. మరోవైపు అధిష్టానాన్ని బెదిరించి టికెట్ సాధించుకున్నారనే చర్చ పార్టీ నేతల్లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3 వ తేదీ నుంచి నవంబర్ 10 మధ్య నామినేషన్ల ప్రక్రియ సాగునున్నది. నవంబర్ 30న పోలింగ్ జరగగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ , అదే రోజు ఫలితాల వెల్లడి కానున్నాయి. 

click me!