తెలంగాణలో దడపుట్టిస్తున్న కరోనా .. తాజాగా 4 కేసులు నమోదు

By Rajesh Karampoori  |  First Published Dec 19, 2023, 10:59 PM IST

TELANGANA: మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి 


TELANGANA: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన రేపుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్త వేరియంట్‌ కేసులపై అప్రమత్తమైంది. ఈ తరుణంలో తెలంగాణలో కరోనా కేసులు వెలువడ్డాయి.

గడిచిన 24 గంటల్లో పలువురిని పరీక్షించగా.  JN-1 లక్షణాలతో ఉన్న  నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో మొత్తం 9 మందికి ఐసోలేషన్‌ చేసి చికిత్స అందిస్తునట్టు వైద్యశాఖ తెలిపింది. అయితే.. అయితే ఏ జిల్లాల్లో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. 

Latest Videos

మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సూచించారు.
 

click me!