Telangana Polls : పోలింగ్‌కు వేగంగా ఏర్పాట్లు.. 36 వేల ఈవీఎంలు రెడీ, హోం ఓటింగ్‌కు మంచి స్పందన : వికాస్‌రాజ్

By Siva KodatiFirst Published Nov 23, 2023, 4:32 PM IST
Highlights

రాష్ట్రంలో తొలిసారిగా హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. 80 ఏళ్లకు పైగా వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసేవారికి హోమ్ ఓటింగ్ వేసేందుకు అనుమతిస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. 

రాష్ట్రంలో తొలిసారిగా హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వున్న ఓటర్లు 9.9 లక్షల మంది వున్నారని ఆయన చెప్పారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ముద్రించి పంపిణీ చేశామని వికాస్ రాజ్ వెల్లడించారు. 

60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని.. మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఆరు నియోజకవర్గాల్లో 5 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు. 

80 ఏళ్లకు పైగా వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసేవారికి హోమ్ ఓటింగ్ వేసేందుకు అనుమతిస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లు వున్నారని.. అలాగే ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ వున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా వున్నారని.. ఇప్పటికే 36 వేల ఈవీఎంలను సిద్ధం చేశామని వికాస్ రాజ్ వెల్లడించారు. 
 

click me!