నన్ను పట్టుకోవడంపైనే భారత్‌ దృష్టి: విజయ్ మాల్య

By narsimha lodeFirst Published Dec 16, 2018, 11:14 AM IST
Highlights

తన నుంచి బకాయిలు వసూలు చేయడం కంటే తనను భార‌త్‌కు రప్పించడంపైనే ప్రభుత్వం దృష్టిసారించిందని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా అన్నారు

లండన్‌: తన నుంచి బకాయిలు వసూలు చేయడం కంటే తనను భార‌త్‌కు రప్పించడంపైనే ప్రభుత్వం దృష్టిసారించిందని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా అన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల ఛానెల్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు  చేశారు. దేశంలోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా ఎగవేసిన మాల్యా రెండేళ్ల క్రితం లండన్‌కు పారిపోయాడు. మాల్యాను తిరిగి అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై లండన్‌ కోర్టు గతవారంలో అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే లండన్ కోర్టు తీర్పుపై అప్పీల్ దాఖలు చేసే విషయమై తన న్యాయవాదుల బ్రుందం ద`ష్టి సారించిందని విజయ్ మాల్యా చెప్పారు. 2016 నుంచి రుణ చెల్లింపుల అంశం పరిష్కారానికి తాను పలు ఆఫర్లు చేసినా సుప్రీంకోర్టులో బ్యాంకులు ఒప్పుకోలేదని సెలవిచ్చారు. సీబీఐ, ఈడీలకు కూడా తన ప్రతి ఆఫర్ ను తిరస్కరించాలని బ్యాంకులు నూరిపోశాయని చెప్పారు. 

ప్రస్తుతం తన ఆస్తుల విక్రయంపైనే బ్యాంకులు, ఈడీ ద్రుష్టి సారించాయని విజయ్ మాల్యా చెప్పారు. కర్ణాటక హైకోర్టు ముందు సమస్య పరిష్కారమైతే సిబ్బంది వేతన చెల్లింపుల బాధ్యత కూడా వారే చేపట్టాల్సి ఉంటుందన్నారు. 

తాను 1988 నుంచి ఎన్నారైనని చెప్పుకొచ్చారు. 1992 నుంచి బ్రిటన్ లో శాశ్వత సభ్యత్వం ఉన్నదని విజయ్ మాల్యా తెలిపారు. 2002లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైతే ఎన్నారైనని ఎన్నికల సంఘం ముందు, కర్ణాటక హైకోర్టు ముందు బీజేపీ సవాల్ చేసినా, తానే గెలిచానని చెప్పుకున్నారు. లలిత్ మోదీ వ్యక్తిగతంగా చాలా బాధ పడ్డారన్నారు. నీరవ్ మోదీ గురించి తనకేం తెలియదని తెలిపారు. 

ఎస్‌ఎంఈ సమస్యల పరిష్కారంపైనే దృష్టి: ఆర్‌బీఐ
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ) డిఫాల్ట్‌ అయ్యాక బకాయిల చెల్లింపుల్లో వెసులుబాటు కల్పించడం కంటే పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ ఏర్పాటు ద్వారా వాటికి రుణ లభ్యతలో ఇబ్బందులు తొలిగించేందుకే ఆర్‌బీఐ ఆసక్తిగా ఉందని డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అన్నారు.

ఐఐటీ-బాంబేలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘రుణాలు తిరిగి చెల్లించలేని సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అదనపు సమయం కల్పించడం కంటే ఆ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న రుణ సమస్యలను గుర్తించి ప్రాథమిక మార్పుల ద్వారా వాటి పరిష్కారానికి ఆర్బీఐ ఆసక్తిగా ఉంది’ అని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.25 కోట్ల వరకు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని గతనెల 19న జరిగిన సమావేశంలో ఆర్‌బీఐకి బోర్డు సూచించింది. 

click me!