Vijay Mallya: కోర్టు ధిక్కార కేసులో విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2000 రూపాయల జరిమానాను కూడా కోర్టు విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు అదనంగా శిక్ష పడుతుంది. అంతే కాదు, విజయ్ మాల్యా విదేశాలకు బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్లను కూడా 4 వారాల్లో తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.