మనిషికి నిజంగా కావాల్సింది ఏమిటి..?

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 3:28 PM IST
Highlights

 'మోక్ష లక్ష్యం' వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. లోకంలోని సమస్యలన్నీ మోక్షం స్థానంలో చిన్నవే. అంటే మోక్షాన్ని సాధించటము అనే పెద్దలక్ష్యం ఉన్నప్పుడు తక్కిన సమస్యలు సాధించినా సాధించకపోయినా పెద్ద సమస్యాత్మకంగా ఉండదు, మనస్సుకి ఇబ్బంది కలగదు.

లోకంలో ధనంలేక కొంతమంది, ఆరోగ్యం సరిగాలేక కొంతమంది, చుట్టూఉండే వ్యక్తుల సహకారంలేక కొంతమంది బాధపడుతుంటారు . కానీ ఆ మూడు ఉన్నపుడు కూడా వ్యక్తికి ఆనందాన్ని కలిగించవు. అనారోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది తప్ప ఆరోగ్యంగా ఉన్నపుడు అది ఆనందాన్నివ్వదు. అలాగే ధనం లేనపుడు లోటు తెలుస్తుంది తప్ప ఉన్నపుడు ఆనందాన్నివ్వదు. అలాగే ఇతరులనుంచి సహకారం వచ్చినపుడు అది సహజంగా కనిపిస్తుంది. అది లోపించినపుడు బాధాకరంగా ఉంటుంది. కాబ్టి, ఈ ఆరోగ్యము, ధనము, సహకారము, లేనపుడు ఇబ్బందిని కలుగజేస్తున్నాయి, ఉన్నపుడు ఆనందాన్ని ఇవ్వటంలేదు.

కొన్ని ఉండి బాధపెడతాయి. అవి సంకల్పం, అహంకారం, మమకారం, తన సంకల్పాన్ని వ్యతిరేకించేవాళ్ళు కొందరైనా ఉంారు కాబ్టి వారినుంచి వ్యతిరేకత వస్తుంది. తద్వారా మనస్సుకి ఘర్షణ ఏర్పడుతుంది. అహంకారము, తనయొక్క వస్తుస్వరూపమైన పరమాత్మ తత్వం, అనంతశక్తి సంపన్నం. కాని మనస్సుకి శరీరానికి గల పరిమిత శక్తులను ఆధారంచేసుకుని, వాటి కంటే కొంత ఎక్కువ తీసుకుని, వాటి ని తనయందు (చైతన్యమునందు) ఆరోపించి వ్యక్తి అహంకారాన్ని పొందుతున్నాడు.  మొది మూడూ లేకపోతే దుఃఖాన్నిస్తున్నాయి ఉంటే ఆనందాన్నివ్వడం లేదు. మరి ఆనదాన్నిచ్చేదేమి? 'మోక్ష లక్ష్యం' వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. లోకంలోని సమస్యలన్నీ మోక్షం స్థానంలో చిన్నవే. అంటే మోక్షాన్ని సాధించటము అనే పెద్దలక్ష్యం ఉన్నప్పుడు తక్కిన సమస్యలు సాధించినా సాధించకపోయినా పెద్ద సమస్యాత్మకంగా ఉండదు, మనస్సుకి ఇబ్బంది కలగదు.

ఈ లక్ష్యం అనే నిర్దేశం లేనపుడు వ్యక్తి, చుట్టూగల సమస్యలనే పెద్ద సమస్యలుగా భావిస్తూాండు. దుఃఖాత్ముడవుతాడు. మోక్షమే లక్ష్యంగా పెట్టుకుంటే తక్కిన అంశాలు బాధించవు. ఈ 'సమస్య' అని దేనిని అంటున్నామో 'ఆ సమస్య పరిష్కరించబడితే, ఆ తరువాత ఏమి?' అని ప్రశ్నించుకున్నపుడు, ఈ 'సమస్య' బాధాకరము కాదు.

రవి మమకారానికి సంబంధించినవాడు. చంద్రుడు సంకల్పానికి సంబంధించినవాడు.

కుజుడు అహంకారానికి సంబంధించినవాడు.  బుధుడు ధనానికి సంబంధించినవాడు.

గురుడు మోక్షలక్ష్యానికి సంబంధించినవాడు.  శుక్రుడు జనసహకారానికి సంబంధించినవాడు.

శని ఆరోగ్యానికి సంబంధించినవాడు.

ఏఏ భావాలలో లోపముందో ఆయా విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. ఈ లోపాలను సవరించుకోవానికి ప్రయత్నం చేయాలి. సహకారంలో లోపమున్నపుడు, 'సర్వేజనా స్సుఖినోభవంతు' అనే ధ్యానము, ధన విషయంలో లోపమున్నప్పుడు 'దాన' ధ్యానము, ఆరోగ్య విషయంలో లోపమున్నపుడు 'ఆరోగ్య' ధ్యానము సంకల్ప విషయంలో దోషమున్నపుడు 'జ్ఞానదాన' ధ్యానము, అహంకార విషయంలో బాధాకరంగా ఉన్నప్పుడు 'ఏకాత్మభావన' ధ్యానము, మమకార విషయంలో లోపమున్నపుడు 'సద్యోముక్తి' ధ్యానము, వ్యక్తికి బాగా ఉపకరిస్తాయి. ఆ లోపాలను పూరిస్తాయి.

అహంకారం 'ఎదుటి వాడికంటే నేనెక్కువ' అనే భావన కదా. ఏకాత్మ భావనచేస్తే ఎక్కువ తక్కువలుండవు. అలాగే సంకల్పలో లోపం ఎందుకు వస్తుంది? 'జ్ఞానం' లోపించినందువలన. అంటే, ఏ పని చేస్తే ఏమిటో  తెలియనందువలన జ్ఞానాన్ని దానంచేసిన భావన చేసినట్లైతే సరైన సంకల్పమే కలుగుతుంది. లేదా సంకల్పము యొక్క అవసరం లేదని తెలుస్తుంది. మమకార విషయంలో, అనుకొన్నది మరోలా జరుగుతుంది అనే భావన కలిగినపుడే బాధను కలిగిస్తుంది. నాది అనుకున్నది నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినపుడు మమకారం బాధిస్తుంది. ఎప్పుడైతే 'సద్యోముక్తి' అనే భావన కలుగుతుందో 'పాలినీ సర్వభూతానాం' అంటే సర్వభూతములను పాలించే తల్లీ అనే భావన వల్ల, 'ఏది జరిగినా అది మనమంచికోసమే' అనే భావాన్ని గుర్తించడం వల్ల, మమకారం బాధించదు. ఉండి బాధించేవి మూడు, లేక బాధించేవి మూడు. మొత్తం ఈ ఆరు రకాల ధ్యానాల వలన విముక్తిని పొందితే 'మోక్షసంకల్పం' వల్ల మోక్షాన్ని సాధించగలుగుతారు. ఆనందాన్నిచ్చేది 'మోక్షలక్ష్యం' తప్ప మిగిలిన ఆరు కావు.

అన్ని పనులు మోక్షంకోసమే చేయాలి. మోక్షం కోసం బతకాలి, బతకడం కోసం తినాలి. తినడానికి సంపాదించాలి. అంటే సంపాదించడం కూడా పరోక్షంగా మోక్షంకోసమే అయినపుడు మోక్షసాధనకు వ్యతిరేక దిశలో పాపమార్గంలో సంపాదన చేయరాదు.

 ఆనందం కావాలి అది ఒక్క మోక్షమే. తక్కినవన్నీ దానికి సాధనాలేగాని జీవితలక్ష్యాలుకావు.

డా.ఎస్.ప్రతిభ

click me!