భావి సిఎంగా ప్రచారం: నారా లోకేష్ భవిష్యత్తుకు పరీక్ష

By telugu teamFirst Published Mar 12, 2019, 12:19 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా లోకేష్ ను భావి ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో లోకేష్ తప్పకుండా గెలువాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ పదవి చేపట్టి దొడ్డదారిన మంత్రి అయ్యారనే అపవాదును తొలగించుకోవడానికి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. చంద్రబాబు వారసుడిగా ముందుకు వచ్చిన ఆయన ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. విజయం సాధిస్తేనే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాగలరు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా లోకేష్ ను భావి ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో లోకేష్ తప్పకుండా గెలువాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ పదవి చేపట్టి దొడ్డదారిన మంత్రి అయ్యారనే అపవాదును తొలగించుకోవడానికి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. 

కుప్పం నుంచి లోకేష్ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. భిమిలీ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయితే ఆ తర్వాత మనసు మార్చుకుని విశాఖ నార్త్ సీటు గురించి ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నారా లోకేష్ తాను పోటీ చేసే స్థానంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆయన సేఫ్ సీటును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా టీడీపికి అనుకూలంగానే ఉంటాయి. అందువల్ల విశాఖపట్నం జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

click me!