సిఎంగా జగన్ ప్రమాణం ఆ రోజు: ముహూర్తం పెట్టింది ఆయనే

By telugu teamFirst Published May 14, 2019, 5:11 PM IST
Highlights

వైసిపి గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాడీ జ్యోతిష్కుడు కాళిదాస్ ఆ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగింది. అది వాస్తవం కాదని వైసిపి వర్గాలంటున్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమాతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. 

జగన్ ఈ నెల 22వ తేదీన ఉండవల్లికి తన పూర్తిగా మకాం మారుస్తున్నారు. దానికి ముందే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయం అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. తాను అధికారంలోకి వస్తాననే ధీమాతోనే ఆయన ఈ తరలింపు కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు చెబుతున్నారు.. 

కాగా, వైసిపి గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాడీ జ్యోతిష్కుడు కాళిదాస్ ఆ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, అది వాస్తవం కాదని వైసిపి వర్గాలంటున్నాయి. 

వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఈ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. 

click me!