జగన్ సిఎం అయితే అజయ్ కల్లాం పంట పండినట్లే...

By telugu teamFirst Published May 6, 2019, 11:42 AM IST
Highlights

అజయ్ కల్లాంకు పరిపాలనలో విస్తృతమైన అనుభవం ఉండడమే కాకుండా క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. ఆయన జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉంది.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ప్రధానమైన భూమికను పోషించనున్నారు. ఆయనకు జగన్ పెద్ద పీట వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే.

అజయ్ కల్లాంకు పరిపాలనలో విస్తృతమైన అనుభవం ఉండడమే కాకుండా క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. ఆయన జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కల్లాం రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలకమైన శాఖల్లో పనిచేశారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కల్లాం అమరావతి నిర్మాణం, సింగపూర్ ఒప్పందం వంటివాటిని విమర్శనాత్మక దృష్టితో చూశారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అయితే, ఆయనకు  ఆ పదవిలో అనుభవం లేదు. దీంతో అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

జగన్ అజయ్ కల్లాం నుంచి పాలనలో నైపుణ్యాలను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయనకు పెద్దగా అనుభవం లేదు. అనతి కాలంలోనే వైఎస్ పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ కూడా తండ్రి బాటలో నడవాలని అనుకుంటున్నారు. 

click me!