జగన్‌పై దాడిచేసింది గాజువాక టిడిపి అభ్యర్థి అనుచరుడే: బుగ్గన

By Arun Kumar PFirst Published Oct 26, 2018, 3:58 PM IST
Highlights

గురువారం ఏపి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ దుండగుడు కత్తితో జగన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. అయితే ప్రస్తుతం జగన్  పరిస్థితి బాగానే ఉన్నా ఈ వ్యవహారంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. 

గురువారం ఏపి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ దుండగుడు కత్తితో జగన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. అయితే ప్రస్తుతం జగన్  పరిస్థితి బాగానే ఉన్నా ఈ వ్యవహారంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. 

ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ పై దాడి జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, డిజిపి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు.  ఈ దాడికి పాల్పడిన వ్యక్తి గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అనుచరుడని బుగ్గన వివరించారు. ఈ దాడిలో టిడిపి హస్తం ఉందడానికి ఇంతకంటే ఆధారాలేమి కావాలని బుగ్గన ప్రశ్నించారు. 

ఈ దాడి తర్వాత కూడా జగన్ ధైర్యాన్ని కోల్పోకుండా హుందాగా హైదరాబాద్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిపై సీఎం చంద్రబాబు  మాట్లాడుతూ...జగన్ గొప్పతనం ఏముందని హేళనగా  మాట్లాడటం తగదన్నారు. అలాగే ఈ  దాడిపై గవర్నర్ నరసింహన్ ఏపి డిజిపికి ఫోన్ చేసి ఆరా తీయడాన్ని కూడా సీఎం తప్పుబడుతున్నారు. తన పేరిట కొనసాగుతున్న ప్రభుత్వంలో ప్రతి విషయం గురించి తెలుసుకునే అధికారం గవర్నర్  కు ఉంటాయన్న విషయాన్ని సీఎం గుర్తుపెట్టాకోవాలని బుగ్గన సూచించారు.

ఇక జగన్ పై దాడి జరిగిని కొద్దిసేపటికే ఎలాంటి  సమాచారం లేకుండానే డిజిపి మాట్లాడుతూ....  జగన్ అభిమానే ఈ దాడికి పాల్పడ్డాడని ప్రకటించాడని బుగ్గన తెలిపాడు. ఓ ఎస్సై స్థాయి పోలీసే ఏ చిన్న సంఘటన జరిగినా  విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తాడని...అతడికి తెలిసిన  నిబంధనలు కూడా డిజిపికి తెలియవా అని విమర్శించారు. ఇక ఈ దాడిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు ఏమాత్రం నమ్మకం లేదని బుగ్గన పేర్కొన్నారు. థర్డ్‌ పార్టీతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు

ఏపీ పోలీసులకు జగన్ షాక్: తెలంగాణ పోలీసులైతే ఓకే

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

 

click me!