చంద్రబాబు భయమే నిజమైంది: మొదటికొచ్చిన జగన్ ఆస్తుల కేసు

By Nagaraju TFirst Published Jan 4, 2019, 11:29 AM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటీషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. దీంతో విచారణ మళ్లీ మెుదటికి వచ్చింది.   

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటీషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. దీంతో విచారణ మళ్లీ మెుదటికి వచ్చింది.   

సీబీఐ న్యాయమూర్తి వెంకట రమణ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం వెంకటరమణ సీబీఐ కోర్టు ఇంచార్జ్ న్యామూర్తిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన శుక్రవారం కోర్టుకు హాజరు కాలేదు. సెలవు కారణంగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. 

ఇకపోతే జగన్ ఆస్తుల కేసులో సీబీఐ 11 చార్జిషీట్ లు దాఖలు చేసింది. వాటిలో మూడు చార్జిషీట్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రెండున్నరేళ్లుగా డిశ్చార్జ్ పిటీషన్లపై విచారణ కొనసాగుతుంది. అయితే న్యాయమూర్తి వెంకటరమణ బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

జగన్ ఆస్తులకు సంబంధించి సీబీఐ ఈడీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటీషన్లపై విచారణ మెుదటికి వచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. 
జగన్‌ ఆస్తుల కేసులో మొత్తం 11 చార్జ్ షీట్ లను సీబీఐ నమోదు చేసింది. 

చార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొన్న జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిగిలిన నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. నేరానికి ఎలాంటి సంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారని ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని పిటిషన్లు వేశారు. 

పిటీషన్లపై గత కొంతకాలంగా సీబీఐ ఈడీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 కేసులకు గానూ రెండున్నరేళ్లలో 4 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో బదిలీ అయ్యారు. 

కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో విచారణ మళ్లీ మెుదటికి వచ్చింది. ఒక్కో ఛార్జిషీట్లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావించి అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. దీంతో డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనుంది. కేసు విచారణకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తేటతెల్లమైంది. 

click me!