టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

By sivanagaprasad KodatiFirst Published Jan 22, 2019, 11:28 AM IST
Highlights

వంగవీటి మోహనరంగా తనయుడు, రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం లాంఛనం కావడంతో ఇప్పుడు బెజవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బెజవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. 
 

వంగవీటి మోహనరంగా తనయుడు, రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం లాంఛనం కావడంతో ఇప్పుడు బెజవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బెజవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. బెజవాడ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది కుల రాజకీయాలు, ఆధిపత్యపోరు.

నాలుగు దశాబ్ధాల క్రితం రెండు కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య పోరు నగరంలో ప్రశాంతతను దూరం చేసింది. వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూల మధ్య సాగిన పోరులో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు కాంగ్రెస్, మరోకరు తెలుగుదేశం పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించి రాజకీయ రణక్షేత్రంలోనూ తలపడ్డారు. 

రంగా హత్య తరువాత బెజవాడ రాజకీయాలు మారిపోయాయి. రంగా తదనంతరం ఆయన కుమారుడు రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు టీడీపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన దేవినేని నెహ్రూ.. సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆయన మరణం తర్వాత 1995లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

దీంతో వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ గొడుకు కిందకు వచ్చాయి. ఒకే వేదికపై ఉన్నప్పటికీ కనీసం వారిద్దరూ మర్యాదపూర్వకంగానైనా మాట్లాడుకునేవారు కాదు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రంగా తనయుడు రాధాకృష్ణ.. సినీనటుడు చిరంజివీ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసే సమయంలో తండ్రిని చంపిన వారితో ఒకే వేదిక మీద ఉండటం ఇష్టం లేకే పార్టీని వీడుతున్నట్లు సన్నిహితులతో రాధ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పీఆర్‌పీ నుంచి పోటీ చేసినప్పటికీ రాధాకృష్ణ ఓడిపోయారు.

ఆ తర్వాత వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాధాకృష్ణ చేరారు. మరోవైపు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు భూస్థాపితం చేయడంతో దేవినేని నెహ్రూ తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 

ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన గుండెపోటుతో మరణించారు. దేవినేని మరణంతో ఆయన కుమారుడు అవినాశ్ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కానీ ఆయనకు అంతంత మాత్రం ప్రాధాన్యతే దక్కుతోంది. ఈ క్రమంలో వంగవీటి రాధాకృష్ణ వైసీపీ రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. 

అవినాశ్‌తో పోలిస్తే బెజవాడతో పాటు కోస్తాలో విపరీతమైన ఫాలోయింగ్, రాజకీయాల్లో అనుభవం, తన సామాజిక వర్గంలో పలుకుబడి రాధాకృష్ణకు ప్లస్‌గా మారింది. దీంతో రాధ ముందు అవినాశ్ నిలబడటం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాధాకృష్ణకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం,  లేని పక్షంలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేందుకు టీడీపీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

కానీ 2019 ఎన్నికలు సమీపిస్తున్నా.. ఆయనకు అసలు టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అవినాశ్ ప్రధానంగా సీఎం చంద్రబాబు కంటే ఆయన తనయుడు మంత్రి నారాలోకేశ్‌పైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన కరుణిస్తే తనకు టికెట్ గ్యారెంటీ అన్న భావనలో అవినాశ్ ఉన్నారు. తండ్రిలాగా రాజకీయాల్లో దూకుడుగా ముందుగా వెళ్లాలని అనుకున్నా... తనకంటూ పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం లేని స్థితిలో అవినాశ్ గందరగోళంలో ఉన్నారు. 

మరోవైపు రాధాకృష్ణ టీడీపీలోకి చేరికపై సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా నేతల నుంచి అభిప్రాయం సేకరించారు. దీనిలో రాధకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే దేనినేని అవినాశ్‌కు కూడా న్యాయం చేయాలని వారు అన్నట్లుగా సమాచారం. మొత్తం మీద వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలోకి చేరడం బెజవాడలో మరోసారి కదలికను తెచ్చారని చెప్పవచ్చు.

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం

click me!