వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

By narsimha lodeFirst Published Sep 19, 2018, 12:25 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు  వైసీపీలో చేరడంతో విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో సమీకరణాలు మారిపోయాయి


విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు  వైసీపీలో చేరడంతో విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో సమీకరణాలు మారిపోయాయి. దీంతో  ప్రస్తుతం వంగవీటి రాధాకు సెంట్రల్ సీటుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

2014 వరకు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కు  గౌతంరెడ్డి ఇంచార్జీగా ఉండేవాడు. అదే ఎన్నికల్లో గౌతం రెడ్డి విజయవాడ సెంట్రల్ సీటు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో విజయవాడ వైసీపీ అధ్యక్షుడిగా వంగవీటి రాధా ఉండేవాడు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి వంగవీటి రాధా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2015 లో విజయవాడ సెంట్రల్  నియోజకవర్గ బాధ్యతలను వంగవీటి రాధాకు అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో వంగవీటి రాధా 2019లో పోటీ చేసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. తాజాగా బూత్ కమిటీల నియామకం  కూడ ప్రారంభమైంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు  వైసీపీలో గత ఏడాది చేరారు. తొలుత విష్ణుకు వైసీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. నగరంపై కంటే సెంట్రల్ సీటు కేంద్రంగానే  మల్లాది విష్ణు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన వారికి కూడ విష్ణు పదవులు ఇప్పించుకొన్నారు.  అంతేకాదు సెంట్రల్ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కో ఆర్డినేటర్ బాధ్యతలను తన అనుచరులకు కట్టబెట్టారు. 

సెంట్రల్ నియోజకవర్గంలో  మల్లాది విష్ణు  కో ఆర్డినేటర్లను నియమించడంపై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని రాధా వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే  పీకే టీమ్ నిర్వహించిన సర్వేలో మల్లాది విష్ణుకే అనుకూలంగా ఉందనే ప్రచారం కూడ సాగింది.దీంతో సెంట్రల్ సీటును విష్ణుకే కేటాయించాలని పార్టీ నాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చిందంటున్నారు. 

వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుండి లేదా ఆవనిగడ్డ, విజయవాడ తూర్పు సీటు నుండి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసేందుకే  వంగవీటి రాధా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో రెందు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు రాధా ప్రకటించారు.

ఈ వార్తలు చదవండి

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..

click me!