ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి.. కోట్లతో ఊడాయించిన కేడీ మొగుడుపెళ్ళాం

Published : Sep 19, 2018, 11:47 AM IST
ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి.. కోట్లతో ఊడాయించిన కేడీ మొగుడుపెళ్ళాం

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్లను వసూలు చేసి ఇద్దరు భార్యాభర్తలు దుకాణం సర్దేశారు. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్లను వసూలు చేసి ఇద్దరు భార్యాభర్తలు దుకాణం సర్దేశారు. విశాఖపట్నానికి చెందిన కొప్పశెట్టి గోపాల్, భారతి లక్ష్మీ అనే ఇద్దరు భార్యాభర్తలు నిరుద్యోగులైన యువకులను పరిచయం చేసుకుని వారికి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు.

వారికి నమ్మకం కలిగేందుకు వీలుగా రాజముద్రతో ఉన్న నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేశారు. అభ్యర్థులంతా వాటిని తీసుకుని ఆయా ఆఫీసులకు వెళితే తమ బండారం బయట పడుతుందనే భయంతో పెట్టెబేడా సర్దేశారు.

చివరికి తమకు ఇచ్చినవి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్‌ అని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే గత నెల 21న ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే