వంగవీటి రాధాపై మల్లాది విష్ణు కామెంట్స్

Published : Sep 19, 2018, 12:23 PM IST
వంగవీటి రాధాపై మల్లాది విష్ణు కామెంట్స్

సారాంశం

ఇదిలా ఉంటే.. తనకు ఆ సీటు కేటాయించడం పట్ల మల్లాది విష్ణు సంతోషం వ్యక్తం చేశారు.

విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీలో మొదలైన రగడ ఇంకా సద్దుమణగలేదు. సెంట్రల్ టికెట్ ఆశించి భంగ పడిన రాధా.. అధిష్టానంపై అలకబూనారు. ఇదిలా ఉంటే.. తనకు ఆ సీటు కేటాయించడం పట్ల మల్లాది విష్ణు సంతోషం వ్యక్తం చేశారు.

విజయవాడ సెంట్రల్‌ బాధ్యతలు ఇచ్చినందుకు వైసీపీ అధినేత జగన్‌కు మల్లాది విష్ణు ధన్యవాదాలు తెలియజేశారు. గడపగడపకు వైసీపీలో భాగంగా నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. సెంట్రల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి అందరిని కలుపుకొని పనిచేస్తానని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్న మల్లాది విష్ణు తన వల్ల రాధాను తప్పించారన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu