వదలను బొమ్మాళి: చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

By narsimha lodeFirst Published Aug 17, 2019, 10:21 AM IST
Highlights

వరద ఎక్కువగా ఉండడంతో ఇల్లును ఖాళీ చేయాలని చంద్రబాబుకు రెవిన్యూ అధికారులు శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. 

అమరావతి: ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఎగువ నుండి  వరద నీరు వస్తున్నందున  శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు నివాసం మెట్ల వద్దకు నీరు చేరుకొంది. శుక్రవారం సాయంత్రానికి మరింత వరద పెరిగింది. శనివారం నాడు చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న అరటితోటలోకి నీరు చేరుకొంది.

దీంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ  చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో కొన్నింటికి ఇప్పటికే  నీరు వచ్చింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు నివాసంతో పాటు మరో 32 ఇళ్లకు కూడ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎగువ ప్రాంతం నుండి వరద వస్తున్న నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. బాబు నివాసం వద్ద నోటీసులు తీసుకొనేందుకు ఎవరూ లేకపోవడంతో వారు వెనుదిరిగారు. ఎగువ నుండి సుమారు 8 ల క్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఇళ్లను ఖాళీ చేయాలని రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

నాలుగు రోజుల క్రితం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు వచ్చారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ లోనే ఆయన  ఉన్నారు. శుక్రవారం  నాడు చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో రికార్డు చేశారు. హై సెక్యూరిటీ జోన్ లో అనుమతి లేకుండా ఎలా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

 

సంబంధిత వార్తలు

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్: మంత్రులకు చుక్కెదురు

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

click me!