విశాఖ గ్యాస్ లీకేజీ కేసు... ఎల్జీ పాలిమర్స్ కు హైకోర్టు ఊరట

By Arun Kumar PFirst Published Oct 9, 2020, 2:21 PM IST
Highlights

విశాఖలో విషయవాయులు లీకేజీతో పలువురి ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థకు కాస్త ఊరట లభించింది. 

అమరావతి: విషవాయువుల లీకేజీ కారణంగా విశాఖపట్నంలో పలువురి మరణాలకు ఎల్జీ పాలిమర్స్ కారణమైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత ప్రభుత్వం ఈ కంపనీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా మూసివేసింది. అంతేకాకుండా ఈ కంపనీకి చెందిన పలువురు ఉన్నతోద్యుగలను కూడా అరెస్టయ్యారు. ఇలా గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత వరుసగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థకు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కాస్త ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది.

విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. ఎల్​జీ పాలిమర్స్​లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగం సిబ్బంది 16 మంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారు వెళ్లే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో సమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి..,జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

read more   ఎల్జీ పాలిమర్స్ బృందానికి ఊరట... కొరియాకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు కారకులుగా పేర్కొంటూ ఇదివరకే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఎల్జీ పాలిమర్స్ సీఈవో, కంపెనీ డైరెక్టర్లు ఉన్నారు. అలాగే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  

 ఈ ఏడాది మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పలు కమిటిలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానమైంది హైపవర్ కమిటి.

ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకేజీకి పలు అంశాలపై హైపవర్ కమిటి ఎత్తి చూపింది. ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీలో పలు లోపాలను కమిటి నివేదిక అభిప్రాయపడింది.విశాఖ పట్టణం నుండి ఈ ఫ్యాక్టరీని తరలించాలని కూడ కమిటి సూచించింది. మరో వైపు లాక్ డౌన్ నిబంధనలను కూడ కంపెనీ పాటించలేదని కమిటి ఎత్తిచూపింది.

అత్యవసర సమయంలోనూ అలారం సిస్టమ్ ను ఉపయోగించలేదని కమిటి తేల్చి చెప్పింది. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించలేదని  కమిటి అభిప్రాయపడింది. కనీసం గేటు వద్ద అలారం కూడ మోగలేదని కమిటి గుర్తించింది. కనీసం ఈ అలారం మోగినా కూడ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది కాదని కమిటి అభిప్రాయంతో ఉంది.

ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు భద్రతా ప్రమాణాలపై అవగాహన లేదని కమిటి తేల్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరులో ఉద్యోగులు స్పందించలేదని కమిటి అభిప్రాయపడింది. రిఫ్రిజరేషన్ కూలింగ్ సిస్టమ్ లో లోపాలు ఉన్నట్టుగా కమిటి గుర్తించింది. అత్యవసర ప్రమాదాల సమయంలో స్పందించడంలో కంపెనీ యాజమాన్యాలు స్పందించలేదని కమిటి నివేదిక తేల్చింది.

ఎం6 ట్యాంకులో ఉన్న స్టైరిన్ లిక్విడ్ లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదం సంబవించిందని కమిటి నివేదిక స్పష్టం చేసింది. ప్రమాద తీవ్రత తగ్గించే రసాయనాలు కూడ తగిన స్థాయిలో లేవని కూడ కమిటి అభిప్రాయపడింది.

click me!