పవన్ కు పిచ్చిపట్టింది... వైజాగ్ హస్పిటల్ లోచేర్చాలి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Published : Apr 23, 2024, 05:57 PM IST
పవన్ కు పిచ్చిపట్టింది... వైజాగ్ హస్పిటల్ లోచేర్చాలి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. ఇంకీ విషయం ఏంటంటే...? 

పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితిపై కామెంట్లు చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్  పరిస్థితి బాలేదని.. మానసికంగా సరిగ్గలేకనే నిలకడ లేని వాఖ్యలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు శ్రీనివాస్. అంతే కాదు ఆయన్ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కూడా అన్నారు. 

సినీమా గ్లామర్ ను.. ఇమేజ్ ను అడ్డుపెట్టకుని కార్లను మార్చినట్టు... భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ కళ్యాణ్ మాటలు చేతలు ఉన్నాయన్నారు. గతంలో బీజేపీ, టీడీపీలపై  పవన్ చేసిన విమర్శలను గుర్తు తెచ్చుకోవాలి అన్నారు.  ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్... ఇప్పుడు బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారని అన్నారు గ్రంధి శ్రీనివాస్.  

అంతే కాదు కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించినవారితో చేతులు కలిపి.. గూండాలతో పవన్ జతకట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గూండాలను వెతనకేసుకొస్తున్న మీదరు..భీమవరంలో గూండాలు, రౌడీలు, బాంబుల అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ..మండి పడ్డారు గ్రంథి.  ఇష్టమొచ్చినట్టు  రెచ్చిపోతూ మాట్లాడుతున్న పవన్ ను చూస్తే ఎవరు రౌడీనో అర్థమవుతుందని అన్నారు. పవన్ గురించి అందరికీ తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో భీమవరంలో చిత్తుగా ఓడించారని చెప్పారు. 

ఇర తాపే ఎమ్మెల్యేగా భీమవరానికి చాలా చేశానన్నారు. తాను చేసిన అభివృద్థి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇక రీసెంట్ గా భీమవరంలో ఎన్నికల ప్రచారం జరిపిన పవన్.. ఎమ్మెల్యే గూండాయిజం అంటూ ఎండగట్టారు. గ్రంధి శ్రీనివాస్ కు పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చారు పవర్ స్టార్. రాంతో పవర్ స్టార్ పై రెచ్చిపోయి ఆరోపణలు చేశారు గ్రంధి శ్రీనివాస్.  తాను ఎన్నో అభివృద్ధి పనులు చేయించానని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu
గోదావరి గలగల కాదు.. కాలుష్యంతో విలవిల సమీక్ష సమావేశం లో పవన్ సీరియస్ | Asianet News Telugu