గంజాయి అమ్మేది తామేనని విజయసాయి ఒప్పుకోవాల్సింది..: టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు

By Arun Kumar PFirst Published Oct 28, 2021, 4:36 PM IST
Highlights

అన్నిరాష్ట్రాల పోలీస్ అధికారులు ఏపీలోనే గంజాయి సాగు అవుతోందని బాహటంగా చెబుతున్నా ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీసారు. ఆ పార్టీ ఎంపీ విజయసాయి దిగజారిన వ్యాఖ్యలుచేయడం తగదని మండిపడ్డారు. 

అమరావతి: గంజాయి సాగు జరుగుతోందని చెప్పిన తెలంగాణ పోలీస్ అధికారిని టీడీపీ వ్యక్తి అనే బదులు... తామే గంజాయి పండించి అమ్ముకుంటున్నామని విజయసాయి రెడ్డి ఒప్పుకుంటే బాగుండేదని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ డీజీపీలు కూడా టీడీపీవాళ్లేనని విజయసాయి ఉద్దేశమా? అని నిలదీసారు. వైసీపీ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి విజయసాయి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు అశోక్ బాబు. 

''తెలంగాణకు చెందిన ఒక పోలీస్ అధికారి కొందరు పోలీస్ ఫ్రెండ్స్ తో కలిసి అరకులో గంజాయి సాగు అవుతోందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడని ఎంపీగా, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ రాష్ట్రంలోకి గంజాయి రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహారించాలని... గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. అంతమాత్రాన KCR ని కూడా TDP మనిషంటాడా?'' అంటూ vijayasai reddy ని Ashok Babu ప్రశ్నించారు. 

''ఏపీలో ganja అక్రమ సాగు, రవాణా జరుగుతుందని నిరూపించాలనుకున్న తెలంగాణ పోలీస్ అధికారి ఎవరో చెప్పడానికి విజయసాయి ధైర్యం చేయలేదు. పైగా ఆ అధికారికి టీడీపీ సభ్యత్వం ఉందన్నట్లుగా ఎంపీ మాట్లాడాడు. అలాగే సదరు అధికారిపై తెలంగాణ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానంటున్నాడు. చివరకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అమ్ముకునే స్థాయికి వైసిపి దిగజారిపోయిందని అనడానికి విజయసాయి దిగజారుడు వ్యాఖ్యలే నిదర్శనం'' అన్నారు. 

''అన్నిరాష్ట్రాల పోలీస్ అధికారులు ఏపీలోనే గంజాయి సాగు అవుతోందని బాహటంగా చెబుతున్నా ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? telangana police అధికారి చర్యవల్ల ఒక పార్టీకి లబ్ది కలుగుతుందని సిగ్గులేకుండా విజయసాయి ఎలా చెబుతాడు?  తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడని ఎంపీస్థాయిలో ఉన్నవ్యక్తి అనడం ముమ్మాటికీ అతని దిగజారుడుతనానికి సంకేతమే. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు తాము, తమ పార్టీనేతలు అక్రమార్జనకోసం గంజాయి అమ్ముతున్నామని విజయసాయి నేరుగా చెప్పాల్సింది'' అని సూచించారు. 

read more  డాన్ విజయసాయి రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో లింకులు...: జనసేన పోతిన మహేష్ సంచలనం

''పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు.  కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, కఠినంగా వ్యవహరించాలని తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పాడు. అంతమాత్రాన కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తేనని విజయసాయి చెబుతాడా?'' అని ప్రశ్నించారు. 

''రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోందని అందరికీ తెలుసు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్ ఘడ్ పోలీసులు ఏపీ గంజాయిని పట్టుకున్నాకూడా  ఈ ముఖ్యమంత్రి దానిపై మాట్లాడడు.  ఏపీ డీజీపీ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. ఆయన్నికూడా పలానా పార్టీ వ్యక్తని అంటారా?'' అనిఎద్దేవా చేసారు. 

''గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆధారాలు అడిగే హక్కు విజయసాయికి ఉందా? ఏ స్థాయిలో ఉన్నడని ఆయన గంజాయికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఇతరరాష్ట్రాల పోలీస్ అధికారులను అడుగుతాడు?  రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా గంజాయి సాగు జరుగుతుంటే తానేదో ఉత్తమ పురుషుడు, తాత్వికుడు అయినట్లు విజయసాయి మాట్లాడితే ఎలా? ఆయనకు నిజంగా దేశభక్తి ఉంటే, రాష్ట్రంలో గంజాయి పట్టుకున్న, పట్టుకుంటున్న పోలీసులను అభినందించాలి. అదిచేయకుండా వారికి పార్టీలు, కులాలు, మతాలు అంటగడుతూ నీచంగా మాట్లాడితే ఎలా?'' అని మండిపడ్డారు.

read more  విశాఖలో గుట్టుగా గంజాయి సప్లై... ఎలా చేస్తున్నారంటే...: పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా

''అతితెలివితేటలతో తాను చేస్తున్న వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డే అల్లరవుతున్నాడు. పరాయి రాష్ట్రం పోలీస్ అధికారులు ఈ రాష్ట్రంలో గంజాయిసాగు అవుతోందని చెప్పడం ఎవరికి సిగ్గుచేటో ఆలోచించావా? విశాఖ ఏజెన్సీలో సాగు అవుతున్న గంజాయివల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ విషయం విజయసాయికి తెలియదా?'' అని నిలదీసారు. 

''సిగ్గులేకుండా గంజాయి పట్టుకోవడానికి వచ్చిన అధికారిపై ఫిర్యాదు చేస్తానని ఎంపీగా ఉన్న వ్యక్తి ఎలా చెబుతాడు? ఈ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయికి రక్షణగా ఉండబట్టే, వైసీపీ ఎంపీ అలా బరితెగించి మాట్లాడుతున్నాడు. ఎంపీ ఆ స్థాయిలో దిగజారాక తాముకూడా ఎప్పుడు ఏదిచేయాలో అదేచేస్తాం. ఈ వ్యవహారంపై కేంద్రానికి, ఎన్ఐఏకు, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి కూడా ఫిర్యాదుచేస్తాం'' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. 

click me!