Asianet News TeluguAsianet News Telugu

డాన్ విజయసాయి రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో లింకులు...: జనసేన పోతిన మహేష్ సంచలనం

ఉత్తరాంద్ర డాన్ విజయసాయి రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయన్న అనుమానం కలుగుతోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేసారు.

janasena leader pothina mahesh sensational comments ycp mp vijayasai reddy
Author
Vijayawada, First Published Oct 28, 2021, 3:02 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయల్లో డ్రగ్స్ దందా, గంజాయి హాట్ టాపిక్ గా మారాయి. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో పట్టుబడిన వేల కోట్ల విలువచేసే 2,988 కిలోల హెరాయిన్‌ విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ చిరునామాతో దిగుమతి అయ్యిందని బయటపడటంతోడ్రగ్స్ వ్యవహారంపై చర్చ మొదలయ్యింది. ఇటీవల ఈ చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ డ్రగ్స్, గంజాయి అడ్డాగా ఏపీ మారిందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. నిన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, నేడు విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ కాస్త ganja, drugs andhra pradesh గా మారిపోయిందని janasena అధికార ప్రతినిధి, vijayawada అధ్యక్షుడు మహేష్ ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడ మాదకద్రవ్యాలు పట్టుబడినా మూలాలు మాత్రం ఏపీలోనే ఉండడం బాధాకరమన్నారు potina mahesh.  

''పొరుగు రాష్ట్రాల పోలీసు అధికారులు ఏకంగా మీడియా సమావేశంలోనే తమ రాష్ట్రంలో పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్ మూలాల ఏపీలో ఉన్నాయని చెబుతున్నారు. ఒక్క విజయవాడలోనే కేజీలకొద్ది గంజాయి పట్టుబడిందని... ఇప్పటివరకు 560మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని స్వయంగా పోలీసులే చెబుతున్నారు. ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్రంలోని 13జిల్లాలో పరిస్థితి ఇలానే ఉంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

read more  విశాఖలో గుట్టుగా గంజాయి సప్లై... ఎలా చేస్తున్నారంటే...: పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా

''గంజాయి, డ్రగ్స్ అక్రమ సరఫరా అడ్డుకోవాల్సిన జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గంజాయ్,డ్రగ్స్ కు పెద్దఎత్తున యువత బానిసలుగా మారిపోతున్నారు. ఈ డ్రగ్స్ మాఫియాతో ఉత్తరాంధ్ర డాన్ విజయసాయిరెడ్డికి లింకులున్నాయన్న అనుమానం వ్యక్తం అవుతోంది'' అంటూ పోతిన మహేష్ సంచలన కామెంట్స్ చేసారు. 

''డ్రగ్స్,గంజాయ్ అక్రమ సరఫరాతో దేశం మొత్తం ఏలెత్తి ఏపీ వైపు చూపిస్తోంది. కాబట్టి మన్యంలో గంజాయి సాగును ద్వంసం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాలి'' అని పోతిన మహేష్ డిమాండ్ చేసారు.

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా డ్రగ్స్, గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని... ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయిందని... ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన మాటలు చూడండి అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ రంగనాథ్ మాట్లాడూతూ.. గంజాయి AOB ప్రాంతం నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. అది వేల కోట్ల బిజినెస్ అని తెలిపారు.

read more  తూ.గో జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి... కొబ్బరికాయల లోడ్ మాటున హైదరాబాద్ కు స్మగ్లింగ్

మరో ట్వీట్‌లో పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వీడియోను షేర్ చేశారు. ‘హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్.. ఏపీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు ఎలా రవాణా చేయబడుతున్నాయో వివరాలను తెలియజేస్తున్నారు’అని పేర్కొన్నారు. 

2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి పోరాట యాత్రను చెప్పటినట్టు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, గంజాయి మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదు వచ్చాయని జనసేనాని తెలిపారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios