ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం, పోలీసులకూ శిక్ష తప్పదు: లోకేశ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 22, 2021, 5:59 PM IST
Highlights

ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతామంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అరెస్ట్‌లు చేసినా మమ్మల్ని ఆపలేరని ఆయన అన్నారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం తనపై 11 కేసులు పెట్టిందని లోకేశ్ గుర్తుచేశారు. 

టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపిస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పిల్లులు పులి అని భావిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతామంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అరెస్ట్‌లు చేసినా మమ్మల్ని ఆపలేరని ఆయన అన్నారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం తనపై 11 కేసులు పెట్టిందని లోకేశ్ గుర్తుచేశారు. మాపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

అంతకుముందు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ మూల డ్రగ్స్‌ను పట్టుకున్నా ఏపీతోనే లింకులు కనిపిస్తున్నాయన్నారు. ఏ గంజాయి ముఠాను పట్టుకున్నా వాళ్లు చెబుతున్నా పేరు ఏపీనే అని నారా లోకేశ్ ఆరోపించారు. ఇవి ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులు చెబుతున్న వాస్తవాలని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్, డీజీపీలు డ్రగ్స్‌తో ఏపీకి సంబంధాలే లేవంటున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలు డ్రగ్స్ హబ్ ఏపీ అని ప్రెస్‌మీట్‌లు పెట్టి చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వాళ్లందరికీ కూడా నోటీసులిస్తారా..? విచారణకి పిలుస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు. 

కాగా, గురువారం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్‌పై నారా లోకేష్ స్పందిస్తూ పోలీసులపై సీరియస్ అయ్యారు. పట్టాభికి ఏమైనా అయితే డిజిపి గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని nara lokesh హెచ్చరించారు. 

ALso Read:అధికారం కోసం సొంత తల్లి, చెల్లిని వీధుల్లోకి... ఇదీ జగన్ చరిత్ర: టిడిపి అనిత సంచలనం

''ప్ర‌జ‌ల్ని ర‌క్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పోలీసులు కాద‌ని తేలిపోయింది. ఏపీలో ప్ర‌జ‌ల‌కీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌కీ ర‌క్ష‌ణ లేదు'' అని అన్నారు. ''ప‌ట్టాభికి హానిత‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారు. ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే DGP Goutham Sawang, CM YS Jagan దే బాధ్య‌త‌. త‌క్ష‌ణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాలి. బోస్‌డీకే అనేది రాజ‌ద్రోహం అయితే.. వైసీపీనేత‌ల అస‌భ్య‌ భాష ఏ ద్రోహం కింద‌కి వ‌స్తుందో డిజిపి చెప్పాలి'' అని లోకేష్ నిలదీసారు. ''డ్ర‌గ్స్ గుట్టుర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైంది. ఎన్ని దాడులుచేసినా, ఎంత‌మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా ప‌రిణ‌మించిన వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించేవ‌ర‌కూ టిడిపి పోరాటం ఆగ‌దు'' అని లోకేష్ స్ఫష్టం చేశారు. 

ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiని శుక్రవారం నాడు rajahmundry Central  జైలుకు తరలించారు పోలీసులు. ఈ నెల 21న పట్టాభిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో నవంబర్ 2వ తేదీ వరకు పట్టాభికి Remand విధించింది కోర్టు. అనంతరం నిన్న సాయంత్రం ఆయనను మచిలీపట్టణం  సబ్ జైలుకు పంపారు. ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని  మచిలీపట్టణం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
 

click me!