డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రా... ఇదేం బోసిడికే పాలన: బోండా ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published Oct 21, 2021, 4:41 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బోసిడికే అన్న పదం దుమారాన్ని రేపుతోంది. టిడిపి నాయకుడు పట్టాభి సీఎం జగన్ ను బోసిడికే అంటే తాజాగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఏపీలో బోసిడికే పాలన సాగుతోందన్నారు. 

విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహిశ్వర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ ను, మాదకద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని... ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ బయటపెట్టిందన్నారు. దీంతో ఉలిక్కిపడి టిడిపి నాయకులు, కార్యాలయంపై దాడి చేసారని bonda uma ఆరోపించారు. 

''జె-బ్రాండ్ కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దేశం మొత్తానికి ఆంధ్రాను drugs కు కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాలలో ycp leaders మద్దతుతో గంజాయి పండిస్తున్నారు. డబ్బు కోసం యువత భవిష్యత్తును పణంగా పెడుతోంది వైసీపీ'' అని ఆరోపించారు.

''స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మమల్ని చంపాలని వైసిపి నాయకులు చూశారు.దేవుడు దయవల్ల చావు అంచుల నుండి నాడు బయటపడ్డాం. మాపై మాచర్లలో దాడి చేసిన విషయం వాస్తవం అవునో కాదో డిజిపి సమాధానం చెప్పాలి. మాపై దాడి  చేసిన గూండాకు మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా టిడిపిపై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం పదవులు ఇస్తోంది'' అని ఆరోపించారు.

read more  బోసిడికే అని తిట్టారు, ఆ పదానికి అర్థం లం... కొడుకు: వైఎస్ జగన్

''రాష్ట్ర భవిష్యత్తు కోసం chandrababu పోరాటం చేస్తుంటే మాపై దాడి చేస్తున్నారు. ఏపీ నుంచి వెళ్లే ప్రతీ కారును తెలంగాణ పోలీసులు తనీఖీలు చేస్తున్నారు. దీనికి కారణం వైసీపీ నేతల డ్రగ్స్ వ్యాపారమే.ఇలాంటి వాటి గురించి ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఏపీకి ఎందుకొచ్చారో dgp goutham sawang చెప్పగలరా?'' అని బోండా ఉమ నిలదీసారు.

''దళిత నేత మాజీ మంత్రి nakka anand babu కు నోటీసులు ఇస్తారా? ఇదేం బోసిడికే (bhosidike) పాలన అని రాష్ట్రంలోని పేద ప్రజలు అంటూ ఉన్నారు. ఎవరూ లేనప్పుడు పోలీసుల అండతో దాడి చేయడం కాదు... మీరు మొగోళ్లు అయితే చంద్రబాబు నాయుడు దీక్ష ముగిసేలోపు రండి'' అని ఉమ సవాల్ విసిరారు.

''గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా ఒక తప్పుచేయకుండా చంద్రబాబు నాయుడు పాలన చేశాడు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళుతుంది.ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడి అధికారులు తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారు. తెదేపా కార్యాలయంపై చేసిన దాడి రాష్ట్ర ప్రజలపై చేసిన దాడిగా చూస్తున్నాం. తప్పుడు కేసులకు తెలుగుదేశం బయపడదు'' అని బోండా ఉమ అన్నారు. 

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని... జగన్మోహన్ రెడ్డి మంచి నటుడని ప్రజలకు అర్ధమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం పన్నుల మోతతో ప్రజల రక్తాన్ని తాగుతోందన్నారు.

read more  'బోసడీకే' అసలు ఆ మాటకు అర్ధం ఏంటంటే.. వైసీపీ ఎంపీ రఘురామ క్లారిటీ

''ఏపీలో గంజాయి ఏరులై పారుతోంది. పక్క రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే వుంటున్నాయి. ఇలా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే వ్యవహారాలపై దృష్టి సారించమంటే మాపై కేసులు, దాడులు'' అని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. 

''నారా లోకేష్ ఏం చేశారని ఆయనపై కేసు పెట్టారు? మాస్కులు అడిగిన సుధాకర్ ను హత్య చేశారు. మీ అరాచకాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేశారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు'' అని మండిపడ్డారు.

''మీ తాటాకు చప్పుళ్లకు భయపడం. ప్రభుత్వ అరాచక విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం'' అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేసారు.

 

click me!