Asianet News TeluguAsianet News Telugu

బోసిడికే అని తిట్టారు, ఆ పదానికి అర్థం లం... కొడుకు: వైఎస్ జగన్

తనను బోసిడెకే అని టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన దూషణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ముఖ్యమంత్రి, ఆయన తల్లిని బూతులు తిట్టారని ఆయన అన్నారు. ఇది కరెక్టేనా అని అడిగారు.

AP CM YS Jagan makes verbal attack on TDP leader
Author
Amaravati, First Published Oct 21, 2021, 8:59 AM IST

అమరావతి: ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం సరైందైనా అని అడుగుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ నాయకుడు పట్టాభి వాడిన బోసిడెకే అనే పదాన్ని ఉచ్చరించారు. బోసిడేకే అని ముఖ్యమంత్రిని తిట్టారని ఆయన అన్నారు. బోసిడెకే అంటే అర్థం లం.... కొడుకు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ అధిపతి అని ఆయన అన్నారు. అటువంటి ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని ఉద్దేశించి తిట్టే పరిస్థితిని చూస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆ పదం వాడిన విషయం తెలిసిందే. తమకు గిట్టని వారు అధికారంలో ఉన్నారని అసత్యప్రచారాలు సాగిస్తున్నారని ఆయన అన్నారు. సీఎంను దారుణమైన బూతులతో తిడుతున్నారని ఆయన అన్నారు.  ఇది తన ఒక్కడి మీద దాడి కాదని, రాష్ట్రం మీద దాడి అని ఆయన అన్నారు. 

పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఆయన గురువారం ఉదయం ప్రసంగించారు. తమవాడు అధికారంలో లేడని పచ్చ మీడియా నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అభిమానులు రెచ్చిపోవాలని, గొడవలు సృష్టించాలని ఆరాటపడుతున్నారని ఆయన టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. రూప మార్చుకున్న అసాంఘిక శక్తులను రాజకీయ నాయకులుగా చూస్తున్నామని ఆయన అన్నారు. నేరగాళ్లు రూపం మార్చుకున్నారని ఆయన అన్నారు.  

Also Read: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

తమకు అధికారం రాలేదని సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాము గెలువలేం కాబట్టి, తమకు గిట్టని మనిషి పాలన చేస్తున్నాడు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర పరువును దిగజార్చే విధంగా డ్రగ్స్ రాష్ట్రం అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారం రాలేదని కులల మధ్య చిచ్చు పెడుతున్నారని, చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఓర్వలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు కళంకం తెచ్చే విధంగా డ్రగ్స్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పిల్లలను మత్తుపదార్థాల బానిసలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది దుర్మార్గం, అనైతికమని ఆయన అన్నారు. అది అబద్ధమని సంబంధిత కేంద్ర సంస్థలు స్ఫష్టం చేశాయని, కేంద్ర సంస్థలు చెప్పిన విషయాలను చూపిస్తూ విజయవాడ కమిషనర్ చెప్పారని, అయినా కూడా అసత్యాలు చెప్పడం మానేయలేదని ఆయన అన్నారు. లెక్కలేనితనంతో, అక్కసుతో పథకం ప్రకారం కుట్రపూరితంగా రాష్ట్రం పరువు ప్రతిష్టలు తీయడానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. 

Also Read: పట్టాభి అరెస్ట్: తలుపులు పగులగొట్టి బలవంతంగా లాక్కెళ్లారని భార్య

శాంతిభద్రతలకు తాము ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని, ఎవరికీ మినహాయింపులు లేవని, తరతమ భేదాలు లేవని వైఎస్ జగన్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడకూడదని ఆయన పోలీసులను ఆదేశించారు. బలహీనవర్గాలమ ీద హింస, దాడులు జరిగితే అందుకు బాధ్యులైనవారిని ఉపేక్షించవద్దని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios