
విజయవాడ: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీనివాసరావుకు రిమాండ్ విధించింది కోర్టు.
గతంలో విజయవాడ కోర్టులో శ్రీనివాసరావు ఉండేవాడు. వారం రోజుల క్రితం విజయవాడ కోర్టు నుండి శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొంది.అయితే ఇవాళ విజయవాడ కోర్టులో శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు పలు అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్‌పై దాడికి సంబంధించిన విషయమై మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
మరో వైపు జైలులో ఉన్న సమయంలో శ్రీనివాసరావు రాసుకొన్న 24 పేజీల లేఖను తనకు ఇప్పించాలని కూడ శ్రీనివాసరావు న్యాయవాదులు కోరారు.అయితే ఈ రెండు అంశాలను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ సాగుతున్న సమయంలో నిందితుడుగా ఉన్న శ్రీనివాసరావు కేసు విషయమై మీడియాతో మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఎన్ఐఏ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు విన్పించారు.
ఎన్ఐఏ వాదనతో కోర్టు ఏకీభవించింది. కేసు విచారణ సాగుతున్న సమయంలో ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు జైలు మాన్యువల్ ప్రకారంగా ఖైదీలుగా ఉన్నవారికి సంబంధించిన వస్తువులను జైలు అధికారులు స్వాధీనం చేసుకొంటారని కోర్టు అభిప్రాయపడింది. జైలు నుండి విడుదలయ్యే సమయంలో ఖైదీల వస్తువులు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని కోర్టు తేల్చి చెప్పింది.
జగన్‌పై దాడికి సంబంధించి న కేసులో శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో భద్రత ఉండదని ఆయన తరపు న్యాయవాదులు భావించారు.రాజమండ్రి లేదా విశాఖ జైలుకు తరలించాలని కోరారు.నిందితుడి తరపున న్యాయవాది కోరిక మేరకు రాజమండ్రి జైలుకు తరలించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది.
సంబంధిత వార్తలు
జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ
జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం
జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...
కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు
జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు
జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు
జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...
జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ
ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు
జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్
ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్
జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు
జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం
జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ
జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే
జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ
జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే
జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్
జగన్‌పై దాడి: జోగి రమేష్ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత
జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్
జగన్‌పై దాడి: శ్రీనివాస్ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?