రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

By narsimha lode  |  First Published Aug 25, 2019, 7:05 AM IST

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పీపీఏ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.


న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సహేతుకం కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) స్పష్టం చేసింది.ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాకు ఓ నివేదికను అందించింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని కూడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ ఈ నెల 16న లేఖ రాసిన విషయం తెలిసిందే.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశం నిర్వహించింది. రివర్స్ టెండరింగ్ పనుల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉందని సమావేశం అభిప్రాయపడింది. అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణం కూడ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పీపీఏ తేల్చింది.ఇదే విషయాన్ని ఈ నెల 16వ తేదీన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది.

Latest Videos

పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖను కూడ పట్టించుకోకుండా రూ.4900 కోట్ల పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెంండర్లను ఆహ్వానించింది. ఈ విషయమై కేంద్రం నివేదిక ఇవ్వాలని పీపీఏను ఆదేశించింది.కేంద్రం ఆదేశాల మేరకు పీపీఏ 18  పేజీల నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించింది.

ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశం మీటింగ్ వివరాలను, ఈ నెల 16వతేదీన ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ వివరాలను కూడ ఈ నివేదికలో పీపీఏ పొందుపర్చింది. అంతేకాదు రాష్ట్ర విభజనతో పాటు ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ వరకు చోటు చేసుకొన్న పరిణామాలను వివరించింది.

నిబంధనల మేరకే బెకమ్ ఇన్‌ఫ్రా, నవయుగ సంస్థలకు పోలవరం కాంక్రీట్ పనులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విషయాన్ని పీపీఏ తన నివేదికలో స్పష్టం చేసింది. 2020 నాటటికి పోలవరం స్పిల్ వే, స్పిల్ చానెల్ పనులను పూర్తి చేస్తామని నవయుగ కంపెనీ స్పష్టం చేసిన విషయాన్ని పీపీఏ తన నివేదికలో గుర్తు చేసింది.

రివర్స్ టెండరింగ్ వల్ల  స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు మరో ఆరు మాసాల పాటు ఆలస్యమయ్యే అవకాశం  ఉందని పీపీఏ అభిప్రాయపడింది.ప్రమాదం జరిగితే ఏ కాంట్రాక్టు సంస్థ బాధ్యత వహిస్తోందని పీపీఏ ప్రశ్నించింది.

రివర్స్ టెండరింగ్ వల్ల తక్కువ ధరకే పనులు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారనే విషయమై స్పష్టత ఉందా అని పీపీఏ ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పట్టిసీమపురుషోత్తపట్నం, తాటిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలు వినియోగించడం వల్ల విద్యుత్తుకే రూ.300 కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ పేర్కొంది.

రివర్స్ టెండరింగ్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఈ నివేదికలో పీపీఏ ఎత్తి చూపింది. హోం వర్క్ చేయకుండానే రివర్స్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వ వెళ్లిందని పీపీఏ అభిప్రాయపడింది.2009లో కాంట్రాక్టు సంస్థతో ఉన్న న్యాయ వివాదాలు 2013 వరకు తేలలేదని పీపీఏ గుర్తు చేసింది. 

సంబంధిత వార్తలు

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

click me!