మీదో తొట్టిగ్యాంగ్, 70 ఏళ్ల పెద్దమనిషివి కొంచెం మైండ్ పెట్టు: చంద్రబాబుపై ప్రభుత్వ విప్ ఫైర్

Published : Aug 24, 2019, 08:59 PM IST
మీదో తొట్టిగ్యాంగ్, 70 ఏళ్ల పెద్దమనిషివి కొంచెం మైండ్ పెట్టు: చంద్రబాబుపై ప్రభుత్వ విప్ ఫైర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఓ తొట్టిగ్యాంగ్ అంటూ తిట్టిపోశారు. 70 ఏళ్లు ఉన్నాయి. పెద్దమనిషివి కొంచెం మైండ్ పెట్టు. ఇప్పటికే పదేళ్లు వెనక్కి వెళ్లావు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకొచ్చారు.   

కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. చంద్రబాబు వరద రాజకీయాలు చేయడం ఇక మానుకోవాలని హితవు పలికారు. 

తెలుగుదేశం పార్టీ ఓ తొట్టిగ్యాంగ్ అంటూ తిట్టిపోశారు. 70 ఏళ్లు ఉన్నాయి. పెద్దమనిషివి కొంచెం మైండ్ పెట్టు. ఇప్పటికే పదేళ్లు వెనక్కి వెళ్లావు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకొచ్చారు. 

ఆ అభివృద్ధిని ఓర్వలేక తమపై బురదజల్లుతారా అంటూ నిప్పులు చెరిగారు. కేవలం రెండు పేజీల్లో యూనిక్‌గా నవరత్నాల అమలుకు వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని చెప్పుకొచ్చారు. వాతావరణం పులకరించి అన్ని డ్యాంలు నిండు కుండను తలపిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇవన్నీ సహించలేని చంద్రబాబు అండ్ బ్యాచ్ వైసీపీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!