విజయనగరంలో దారుణం: గ్రూప్ హౌజ్ లో గుట్టుగా వ్యభిచారం

By Bukka Sumabala  |  First Published Aug 10, 2022, 1:26 PM IST

గ్రూప్ హౌజ్ లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


విజయనగరం : స్థానిక కస్పా హైస్కూల్ సమీపంలో ఒక గ్రూప్ హౌజ్ లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. కస్పా హైస్కూల్ సమీపంలో ఉన్న గ్రూప్ హౌజ్ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళను ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. 

ఇదిలా ఉండగా, జూన్ 1న క్రిష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మసాజ్ పేరుతో వ్యభిచారం రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ వేధింపులకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్ గదిలో జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్ రెడ్డి (30) ప్రైవేట్ ఉద్యోగి. 

Latest Videos

undefined

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో: ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అనంత పోలీసులు

రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహం అయ్యింది. శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చి పోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరు శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గరూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తడికి గురైన శ్రీకాంత్ రెడ్డి బెంజి సర్కిల్ లోని ఓ హోటల్ లో గది తీసుకుని తన ఆవేదనంగా చెప్పుకుంటూ ఓ సెల్పీ వీడియో తీశాడు. ఆ తరువాత హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

click me!