దువ్వాడ, మాధురి పూర్తిగా ఓపెన్ అయిపోయారుగా ... తిరుమలలో ఎలా సందడి చేశారో చూడండి

Published : Oct 07, 2024, 09:47 AM ISTUpdated : Oct 07, 2024, 01:45 PM IST
 దువ్వాడ, మాధురి పూర్తిగా ఓపెన్ అయిపోయారుగా ... తిరుమలలో ఎలా సందడి చేశారో చూడండి

సారాంశం

టెక్కలి వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, అదే నియోజకవర్గానికి చెందిన నాయకురాలు దివ్వెల మాధురి వ్యవహారం మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. 

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి రిలేషన్ షిప్ పై తీవ్ర దుమారం రేగిన విషయం  తెలిసిందే. కట్టుకున్న భార్యను కాదని దువ్వాడ మాధురితో కలిసి వుంటున్నారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురితో కలిసి తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. శ్రీవారిని దర్శించుకుని జంటగా బయటకు వచ్చిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇలా తిరుమల కొండపై కోలాహలం వేళ ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కనిపించారు. ఇటీవల వివాదం తర్వాత వీళ్లు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ గా మారింది. 

ఇటీవల భార్యా పిల్లలతో వివాదం తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఓపెన్ అయిపోయారు... మాధురితో మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. స్కూటీపై ఈ ఇద్దరు వెళుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వీడియో కూడా వైరల్ గా మారింది.  

 

PREV
click me!

Recommended Stories

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయంలో అడుగుపెట్టిన తొలి విమానం| Asianet Telugu
Suddala Ashok Teja CITU India Conference: సుద్దాల కొమరం భీముడో పాటకి సభ మొత్తం పూనకాలే | Asianet