యువతులను మూలన కూర్చోబెట్టి... వ్యభిచార గృహంలో పోలీసుల ఓవరాక్షన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 14, 2022, 10:50 AM IST
Highlights

తప్పుచేసిన మహిళలతో పోలీసులు చాలా తప్పుగా వ్యవహరించిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలుగుచూసింది. పోలీసులు వ్యభిచార గ‌ృహంపై దాడిచేసి పట్టుబడిన మహిళలతో వ్యవహరించి తీరు విమర్శలకు దారితీస్తోంది. 

విజయవాడ : తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ. కానీ కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఓవరాక్షన్ చేస్తుంటారు. నిందితులనే కాదు బాధితులతోనూ అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం, దుర్భాలాడటం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం... ఇలా పోలీసుల అతిగా వ్యవహరించిన అనేక ఘటనలు వెలుగుచూసాయి. తాజాగా కృష్ణా జిల్లా పోలీసులు కొందరు మహిళలతో వ్యవహరించి తీరు, మాట్లాడిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా వున్నాయి. ఆ మహిళలు తప్పు చేసి వుండవచ్చు... కానీ వారితో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా వుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. ముగ్గురు యువతులు, నిర్వహకురాలు, ఓ విటుడు ఇంట్లో వున్న సమయంలో ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు తప్పుచేస్తున్న మహిళలు, విటుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడకుండా దారుణంగా వ్యవహరించారు. 

Read More మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... విజయవాడలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

వ్యభిచారం జరుగుతున్న ఇంట్లో దర్జాగా కూర్చుని వ్యభిచారం చేస్తున్న మహిళ, యువతులపై దౌర్జన్యం చేసారు. పేక ముక్కలను చేతుల్తో పట్టుకుని మహిళలను కూర్చోబెట్టి దుర్భాషలాడారు. నైటీ మార్చుకొని వస్తారా.... ఇలానే కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్లనా అంటూ నీచంగా మాట్లాడుతూ బెదిరించారు. భయపడిపోయిన మహిళలు వేడుకున్నా వినిపించుకోకుండా  పోలీసులు వారితో అమానుషంగా వ్యవహరించారు. 

వీడియో

అయితే పోలీసులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళలను దుర్భాలాడుతుండగా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో సదరు పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు. తప్పుచేసినప్పటికి మహిళలతో పోలీసులు ఇంత నీచంగా వ్యవహరించడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

click me!