జ్యోతి హత్య: సీసీ పుటేజీలో శ్రీనివాస్ 'సిత్రాలు'

Published : Feb 20, 2019, 04:26 PM IST
జ్యోతి హత్య: సీసీ పుటేజీలో శ్రీనివాస్ 'సిత్రాలు'

సారాంశం

:అమరావతి టౌన్‌షిప్‌కు  సమీపంలో ఈ నెల 11వ తేదీన జ్యోతి హత్య కేసులో ఆమె ప్రియుడే నిందితుడుగా పోలీసులు నిర్ధారించారు. అయితే గతంలో కూడ శ్రీనివాస్ పలువురు యువతులను మోసగించినట్టుగా గుర్తించారు

అమరావతి:అమరావతి టౌన్‌షిప్‌కు  సమీపంలో ఈ నెల 11వ తేదీన జ్యోతి హత్య కేసులో ఆమె ప్రియుడే నిందితుడుగా పోలీసులు నిర్ధారించారు. అయితే గతంలో కూడ శ్రీనివాస్ పలువురు యువతులను మోసగించినట్టుగా గుర్తించారు. శ్రీనివాస్ ఫోన్‌లో కొన్ని అమ్మాయిల నగ్న చిత్రాలు, వీడియోలను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది.

ఆసుపత్రిలో శ్రీనివాస్ వ్యవహరాన్ని పోలీసులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ చికిత్స పొందుతున్న గదిలో పోలీసులు రహస్యంగా  కెమెరాను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ గదిలో పోలీసులు ఉంటే ఓ రకంగా లేకపోతే మరో రకంగా  వ్యవహరిస్తున్నారని పోలీసులు గమనించారు.

పోలీసులు లేకపోతే తన సెల్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలను శ్రీనివాస్ చూస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసులు ఉంటే మాత్రం ముభావంగా ఉంటున్నాడని ఈ దృశ్యాల్లో రికార్డైనట్టుగా సమాచారం.

 అమరావతి టౌన్‌షిప్‌కు సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ నెల 11వ తేదీన జ్యోతి దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనకు ప్రియుడు శ్రీనివాస్ కారణమని పోలీసులు చెబుతున్నారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గాను  శ్రీనివాస్ స్నేహితుడు పవన్  అతని తలపై రాడ్‌తో కొట్టాడు. ఈ రాడ్‌ను కూడ పోలీసులు స్వాథీనం చేసుకొన్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో శ్రీనివాస్ చికిత్స పొందుతున్నాడు. బుధవారం నాడు శ్రీనివాస్‌ను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని సమాచారం.  గతంలో కూడ శ్రీనివాస్ అనేక మంది మహిళలను మోసగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తన సెల్‌ఫోన్‌లో కొందరు యువతుల నగ్న చిత్రాలు, వీడియోలను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారని సమాచారం.

ఈ విషయాలు తెలియడంతో పాటు పెళ్లి చేసుకోవాలని జ్యోతి డిమాండ్ చేసిందని.... అయితే పెళ్లి చేసుకోవాల్సి వస్తోందనే కారణంగానే శ్రీనివాస్ ఆమెపై దాడి చేసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

కదలకుండా జ్యోతి కాళ్లు, చేతులు పట్టుకొన్న శ్రీనివాస్, తలపై మోదిన పవన్

జ్యోతి హత్య ప్రియుడి పనే: యువతుల న్యూడ్ వీడియోలు తీసిన చరిత్ర

జ్యోతి హత్య: పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ధర్నా

అమరావతి హత్య, రేప్‌‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం

జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి

PREV
click me!

Recommended Stories

Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం | Asianet News Telugu
ధర్నాలతో సమస్యలు పరిస్కారం కావు: Gummadi Sandhyarani on Anganwadi Workers | Asianet News Telugu