సోషల్ మీడియాలో యువతుల నగ్న చిత్రాలు..నిందితుడు అరెస్ట్

By telugu news teamFirst Published Jul 16, 2020, 2:45 PM IST
Highlights

ఫేక్ వర్చువల్ నెంబర్స్ తో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రీయేట్ చేశాడు. ఆ తర్వాత తనతోపాటు గతంలో చదువుకున్న అమ్మాయిల ఫోటోలందరివీ సేకరించి వాటిని మార్ఫింగ్ లో నగ్న చిత్రాలుగా మార్చాడు.
 

సోషల్ మీడియాలో యువతుల నగ్న చిత్రాలను పోస్టు చేస్తానంటూ వారిని బెదిరిస్తున్న నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలోని కొచ్చిలో యానిమేషన్‌ మల్టీ మీడియాలో బీఎస్సీ పూర్తి చేశాడు. గుంటూరులో కొంతకాలం సొంతంగా ఐటీ కంపెనీ నిర్వహించాడు. లాక్‌డౌన్‌ సమయంలో తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. 

ఫేక్ వర్చువల్ నెంబర్స్ తో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రీయేట్ చేశాడు. ఆ తర్వాత తనతోపాటు గతంలో చదువుకున్న అమ్మాయిల ఫోటోలందరివీ సేకరించి వాటిని మార్ఫింగ్ లో నగ్న చిత్రాలుగా మార్చాడు.

తిరిగి ఆ యువతుల అసలైన నగ్నఫొటోలను తనకు పంపాలని..లేకపోతే తన వద్ద ఉన్న నగ్నఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని, మిత్రులకు పంపుతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. కొంతమంది  ఆ ఫేక్‌ నంబర్‌ను దైర్యం చేసి బ్లాక్‌ చేయగా ఓ యువతి భయపడి అతను చెప్పినట్లు చేసింది.

దీంతో.. ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినట్లే చాలా మందిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో గుంటూరు నగరంపాలెం పరిధిలో నివశించే యువతి ధైర్యం చేసి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని పట్టుకోగలిగారు. మొత్తం 10 మంది విద్యార్థినీలను ఇలా బెదిరించినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్‌ అకౌంట్లను ఛేదించారు. నిందితుడి ఫోన్‌ నంబర్, అడ్రస్‌ గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

click me!