ఒంగోలు గ్యాంగ్ రేప్: నిందితుల పట్టివేత, ప్రధాన నిందితుడు దివ్యాంగుడు

By telugu teamFirst Published Jun 23, 2019, 9:28 AM IST
Highlights

పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెడుతామని డిఎస్పీ చెప్పారు. బాలికను పది రోజుల పాటు నిర్బంధించి వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు సామూహిత అత్యాచారం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెడుతామని డిఎస్పీ చెప్పారు. బాలికను పది రోజుల పాటు నిర్బంధించి వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

కేసులో ప్రధాన నిందితుడు బాజీ దివ్యాంగుడు. అతను బస్ స్టేషన్ లోని దుకాణంలో పనిచేస్తున్నాడు. తాను ప్రేమించిన కారు డ్రైవర్ రామును కలవడానికి వచ్చిన గుంటూరు బాలిక ఒంగోలు బస్ స్టేషన్ లో నిరీక్షిస్తుండగా బాజీ ఆమెను ట్రాప్ చేశాడు. రాము తనకు తెలుసునని చెప్పి ఆమెను తీసుకుని వెళ్లాడు.

బాలికను ఆకాశ్ అనే మిత్రుడి గదికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆరుగురు బాలికపై నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు డిఎస్పీ అంటున్నారు. నిందితుల్లో శ్రీకాంత్ అనే నిందితుడు కూడా ఉన్నాడు.  

రాము అనే కారు డ్రైవర్ రామును బాలిక ప్రేమించింది. అతన్ని కలవడానికి గుంటూరు నుంచి బాలిక ఒంగోలు వచ్చింది. ఒంగోలు బస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత రాముకు ఫోన్ చేసింది.. అయితే, ఎంతకీ కలవకపోవడంతో అక్కడే ఉండిపోయింది. దాన్ని గమనించిన బాజీ రాము తనకు తెలుసునని బాలికను తన వెంట తీసుకుని వెళ్లాడు. 

రాము కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఫోన్ పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. 

సంబంధిత వార్త

కీచకపర్వం: నిర్బంధించి బాలికపై నాలుగు రోజులు గ్యాంగ్ రేప్

click me!