Asianet News TeluguAsianet News Telugu

కీచకపర్వం: నిర్బంధించి బాలికపై నాలుగు రోజులు గ్యాంగ్ రేప్

మిత్రుడి వద్దకు చేరుస్తానంటూ నమ్మబలికి తనతో తీసుకుని వెళ్లి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. 

16 year old girl gang raped by six for 10 days
Author
Ongole, First Published Jun 23, 2019, 7:23 AM IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గదిలో నిర్బంధించి పదహారేళ్ల బాలికపై ఆరుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. . మిత్రుడైన ఆటో డ్రైవర్ ను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయిని ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. 

మిత్రుడి వద్దకు చేరుస్తానంటూ నమ్మబలికి తనతో తీసుకుని వెళ్లి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి.. ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

గుంటూరు నగరానికి చెందిన ఓ బాలిక తన తాతకు అనారోగ్యంగా ఉండటంతో అతనికి సాయంగా అక్కడి ఆస్పత్రిలో ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన  టాక్సీ డ్రైవర్‌ అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని అదే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంలో ఆ డ్రైవర్‌ బాలికతో మాటలు కలిపాడు.ఆ పరిచయంతో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. 

ఆ విషయం తల్లికి తెలియడంతో కూతుర్ని ఇటీవల మందలించింది. దీంతో ఆగ్రహించిన బాలిక ఇల్లు వదిలిపెట్టి ఒంగోలుకు పయనమైంది. బస్టాండ్‌కు చేరుకుని ఆటో డ్రైవర్‌ కోసం వాకబు చేసింది. బస్టాండ్‌లోని ఒక చిరు దుకాణంలో పనిచేసే యువకుడు ఇదంతా గమనించాడు. ఆ బాలికతో మాటలు కలిపాడు. 

ఆమె సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ అయిపోవడంతో ఆ యువకుడి షాపులోనే చార్జింగ్‌ పెట్టుకుంది. ఈ క్రమంలో అతను బాలికకు మాయ మాటలు చెప్పాడు. టాక్సీ డ్రైవర్‌ ఆచూకీ లభించేంత వరకు తాను ఆశ్రయం కల్పిస్తానని నమ్మించడంతో అతని వెంట నడిచింది.

నగరంలోని రద్దీ ప్రాంతంలో గల ఒక రూమ్‌కు బాలికను తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు మరో ఐదుగుర్ని ఆమెపై వరుస లైంగిక దాడులకు పురిగొల్పాడు.  చివరకు శనివారం ఒంగోలు బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీసులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. 

 నిందితులలో ఇరువురు ఇంటర్మీడియెట్‌ చదివిన యువకులని, మరో నలుగురు యువకులు ఇంజనీరింగ్‌ విద్యార్థులని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ ఇప్పటికే తమ సిబ్బందిని రంగంలోకి దించామని, ఆరుగురు నిందితులను గుర్తించామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios