ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

By Nagaraju TFirst Published Oct 25, 2018, 6:56 PM IST
Highlights

వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిని సినీనటుడు నిర్మాత మంచు మోహన్ బాబు ఖండించారు. జగన్ పై దాడి దుర్మార్గపు చర్య అంటూ అభిప్రాయపడ్డారు. పెన్ను కూడా తీసుకెళ్లలేని విమానాశ్రయంలోకి కత్తితీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. 

తిరుపతి:వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిని సినీనటుడు,నిర్మాత మంచు మోహన్ బాబు ఖండించారు. జగన్ పై దాడి దుర్మార్గపు చర్య అంటూ అభిప్రాయపడ్డారు. పెన్ను కూడా తీసుకెళ్లలేని విమానాశ్రయంలోకి కత్తి తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. నిందితుడిని హత్య చెయ్యాలని ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలో విచారించాలని ఆయన గురువారం డిమాండ్ చేశారు. ఆ విషయం తేలాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

తాను రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తినని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అయితే ఒక సినీ నిర్మాతగా, నటుడిగా బాధ్యతగల పౌరుడిగా ఇలాంటి ఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు మడికట్టుకుని ఇంట్లో కూర్చోలేనని తెలిపారు. 

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో దాదాపు మూడు వేలకు పైగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి జగన్ అని మోహన్ బాబు కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

click me!