వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల

Published : Oct 25, 2018, 06:24 PM IST
వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల

సారాంశం

సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. జగన్ ఎడమ భుజంలోకి కత్తి బలంగా దూసుకుపోయిందని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్: సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 
జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. జగన్ ఎడమ భుజంలోకి కత్తి బలంగా దూసుకుపోయిందని వైద్యులు తెలిపారు. 

దాదాపు 3 నుంచి 4 సెంటీమీటర్ల దూరం వరకు కండరానికి గాయం అయ్యిందని తొమ్మిది కుట్లు వేసినట్లు తెలిపారు. అయితే జగన్ రక్త నమూనాలను సేకరించామని వాటిని ల్యాబ్ కు పంపిచినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అలాగే దాడికి ఉపయోగించిన కత్తిని సైతం ల్యాబ్ కు పంపించామన్నారు. 

ఏమైనా విషపూరిత ద్రావణాలు కత్తికి పూసి ఉంటారా అన్న సందేహంతో కత్తిని ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం చాలా నిలకడగా ఉందన్నారు. జగన్ రిపోర్ట్స్ వచ్చే వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. శుక్రవారం రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆ తర్వాత డిశ్చార్జ్ పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 

సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో జగన్ వెంట ఆయన భార్య భారతి, తల్లి విజయలక్ష్మీతోపాటు వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే ఆస్పత్రి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఈ వార్తలు కూడా చదవండి 

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

PREV
click me!

Recommended Stories

Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu
Nellore Sp Ajitha Vejendla: వాటిని నమ్మొద్దు.. వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు | Asianet News Telugu