నాది నీలా దొడ్డి దారి కాదు: ఆదినారాయణరెడ్డిపై మేడా

By Nagaraju TFirst Published Jan 22, 2019, 7:03 PM IST
Highlights

ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. 

హైదరాబాద్: ఏపీమంత్రి ఆదినారాయణరెడ్డిపై రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నిప్పులు చెరిగారు. ఆదినారాయణరెడ్డి దొడ్డిదారిన టీడీపీలో చేరి మంత్రి పదవులు పొందారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రాజకీయ భిక్ష పెడితే ఆదినారాయణ రెడ్డి గెలిచారని గుర్తు చేశారు. 

రాజశేఖర్ రెడ్డి భిక్ష పెడితే ఆదినారాయణరెడ్డి ఆ కుటుంబాన్ని వంచించారని విరుచుకుపడ్డారు. డబ్బుకు అమ్ముడుపోయిన ఆదినారాయణరెడ్డిని ప్రజలు క్షమించరన్నారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. తనపై నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేసింది ఆదినారాయణరెడ్డేనని స్పష్టం చేశారు. 

ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. 

రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చామని ప్రజల్లోకి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నామని తెలిపారు. భవిష్యత్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ నేతృత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి.    

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపికి గుడ్ బై: ఎమ్మెల్యే పదవికీ మేడా రాజీనామా

మేడాకి అసలు ఆ అర్హత లేదు... చంద్రబాబు

టీడీపి నుంచి మేడా సస్పెన్షన్: చంద్రబాబు ప్రకటన

చంద్రబాబుతో భేటీకి డుమ్మా: జగన్ తో భేటీకి మేడా రెడీ

మేడా మాట మార్చారు, సోదరుడి కోసమే..: సిఎం రమేష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు

 

click me!