పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

By sivanagaprasad kodatiFirst Published Dec 17, 2018, 10:49 AM IST
Highlights

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కొనసీమపైనే అధిక ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కొనసీమపైనే అధిక ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పెథాయ్ జిల్లాలోని తుని-యానాం ప్రాంతాల మధ్య తీరం దాటుతుందని.. అందువల్ల ‘‘కోనసీమ’’పై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో పెథాయ్‌ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

కోనసీమలో ఇరవై ఏడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. తిత్లీ సమయంలో పనిచేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు అందుబాబులో ఉంచామని, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు గాను సెల్ టవర్ల వద్ద జనరేటర్ల సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

అవసరమైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించామని కార్తీకేయ మిశ్రా స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాలను భద్రపరచుకోవాలని, పాడుపడిన ఇళ్లలో, పూరి గుడిసెల్లో ఉండకుండా దగ్గర్లో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు. మరోవైపు పెథాయ్ తుఫానుతో కొబ్బరి, అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సంభవించిన తుఫాన్లలో ఈ ప్రాంత రైతులు దారుణంగా దెబ్బతిన్నారు. 
 

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఏపీలో ‘‘పెథాయ్’’ విలయ తాండవం

పెథాయ్ తుఫాన్: తెలంగాణ‌పై ఎఫెక్ట్

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ బీభత్సం: ఏపీలో రైళ్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు

click me!